K.Viswanath: తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ కె విశ్వనాథ్ ఒకరు. తాజాగా ఈయన అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఎంతోమంది ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు. అలాగే గతంలో విశ్వనాథ్ గారు పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి తన కెరీర్ గురించి చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే విశ్వనాథ్ ఎన్టీఆర్ మధ్య కూడా పెద్ద గొడవ చోటుచేసుకుందని ఈ గొడవ కారణంగా 14 సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవ రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కాలేజీ చదివే రోజుల్లోనే విశ్వనాథ్ గారికి ఎన్టీఆర్ సీనియర్.ఇలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉంది అయితే చదువులు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రాగా అనంతరం విశ్వనాథ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇక ఇండస్ట్రీలో ఒకరు నటుడిగా మరొకరు డైరెక్టర్గా స్థిరపడ్డారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం చిన్ననాటి స్నేహితులు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికీ గొడవ చోటు చేసుకుందని తెలుస్తోంది. ఒక సెంటిమెంట్ సన్నివేశాన్ని షూట్ చేసే సమయంలో ఎన్టీఆర్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చారట ఇది సెంటిమెంట్ సన్నివేశం ఆ గ్లాసెస్ అంత బాగుండవు అని విశ్వనాథ్ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వినకుండా సన్ గ్లాసెస్ తోనే షూటింగ్లో పాల్గొనడంతో ఈ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది.
ఇక ఈ గొడవ సమయంలో ఎన్టీఆర్ విశ్వనాధ్ గారి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని అయితే ఇలాగే 14 సంవత్సరాల పాటు మాటలు లేకుండా ఉన్నారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ విశ్వనాధ్ గారు మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…