KA paul : గ్లోబల్ పీస్ మేకర్ గా అందరికీ తెలిసిన పాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామం. పదవ తరగతి కూడా పూర్తి కాని పాల్ మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. తన ఎనిమిదవ ఏట క్రిస్టియనీటి స్వీకరించిన కే ఆనంద్ పాల్ ఆ తరువాత దేశ విదేశాల అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. ఆయన పీస్ మేకర్ గా అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారు అంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చదువు, ఆరోగ్య సేవలు అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసారు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నేటి రాజకీయాల గురించి నాయకుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆయన అస్థి అన్ని లక్షల కోట్లు…
కేఏ పాల్ కు ఏ భారతీయుడికీ దక్కని అరుదైన గౌరవం ఉంది, అదే అమెరికన్ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉండే బోయింగ్ విమానం మన కేఏ పాల్ కి ఉండటం. ఆయన పీస్ అంబాసిడర్ గా ప్రపంచదేశాలలో తిరిగడానికి బోయింగ్ 747 ఎస్పి విమానం ఇప్పటికీ అమెరికా రాష్ట్రాలలో ఉన్నది. ఇక ఆయనకు ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు ఆయన చరిటీ సంస్థలకు కొన్ని వందల ఎకరాలను దానం చేసాయి. వాటిలో ఆయన చారిటీ పనులు జరుగుతున్నాయి. ఎక్కువగా కేఏ పాల్ గారు ఆయన సంస్థ సేవలను ఆఫ్రికా దేశాల లాంటి దేశాలలో విస్తరించారు. ఇక ఆయనకు ఐదు లక్షల కోట్ల ఆస్తి ఉందన్న ప్రచారాలకు క్లారిటీ ఇస్తూ అది నా అస్థి కాదు ఆ ఐదు లక్షల కోట్లు ఎంతో మంది చదువులు ఆరోగ్యం కోసం చేసిన డొనేషన్స్ అంటూ చెప్పారు.

ఇప్పటివకు దాదాపు 40 లక్షల మందికి చదువు చెప్పించామని అలాగే ఎంతో మందికి ఆరోగ్య సేవలను అందిచామని చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను గుర్తించకుండా ఒక కమెడియన్ లా చూస్తున్నారు అన్న వాదనకు కొన్ని మీడియా సంస్థలు మాత్రమే అలా చిత్రీకరిస్తున్నాయి, బయట అలా లేదు, జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటూ కృష్ణ గారి పార్థివ దేహం చూడటానికి వెళ్లి ప్రార్థన చేయడం వెనుక కథ అడుగగా కృష్ణ గారికి తనంటే ఎంతో అభిమానం అని చెప్పారు. ఆయన తన అనుమతితో శాంతి సందేశం సినిమాను తీసారని అలాగే నా బయోపిక్ తీయాలనే కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారని కేఏ పాల్ తెలిపారు.
































