Kadambari Kiran : ఆ ఛానెల్ ఓనర్ ను నమ్మి 25 లక్షలు నష్టపోయాను….: కాదంబరి కిరణ్

0
64

Kadambari Kiran : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక డైరెక్టర్ గా సీరియల్ ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితుడైన కాదంబరి కిరణ్ తన సినిమా చేదు అనుభవాలతో పుస్తకాన్ని కూడా రాస్తున్నానని చెప్పారు. కిరణ్ మొదట జర్నలిస్ట్ గా ఈనాడు లో పనిచేస్తూ ఉన్నపుడే సీరియల్స్ లో నటించారు. ఇక చాలా సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉండి చాలా డబ్బు నష్టపోయినట్లు చెప్పారు కిరణ్. కొంతమంది పెద్ద మనుషుల్లాగే ఉంటూ డబ్బు మోసం చేసారంటూ చెప్పారు కిరణ్. అలా నాకు డబ్బు మోసం చేసిన వాళ్ళు నా శాపాలు తగిలి కుళ్ళి చస్తారు అంటూ ఫైర్ అయ్యారు.

ఆ టీవీ ఛానెల్ వాళ్ళు మోసం చేసారు….

ప్రముఖ ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ అలానే సీరియల్స్ చేస్తూ ఉండే కాదంబరి గారు సీరియల్స్ నిర్మించి చాలా నష్టపోయారు. అయినా కూడా నిర్మాణ రంగంలోనే ఉన్న కిరణ్ గారు ఒక టీవీ ఛానెల్ కోసం రాష్ట్రంలో ఉన్న గుర్తింపు ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళను తీసుకుని వారితో ప్రోగ్రామ్ చేయించాలని మొత్తం డబ్బు ఖర్చు పెట్టి వాళ్లకు వసతులు అలాగే యూనిఫామ్ అన్ని చేసి కొంత షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ అప్పుడు కాన్సెప్ట్ మనం అనుకున్నది ఇది కాదు కిరణ్ అని పక్కన పడేసారు.

Actor Kadambari Kiran: దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… ఆరెంజ్ మెగా స్టార్ కి మాత్రమే ఉంది: కాదంబరి కిరణ్
Actor Kadambari Kiran: దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… ఆరెంజ్ మెగా స్టార్ కి మాత్రమే ఉంది: కాదంబరి కిరణ్

ఆ మాట అనగానే అక్కడే కూలబడిపోయాను. తరువాత వారం రోజులు బెడ్ మీద ఉన్నాను. మొత్తం 25 లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేస్తే కుట్ర చేసి కావాలనే నా ప్రోగ్రామ్ ఆపించారు. ఇక రావాల్సిన డబ్బు ల కోసం పోరాడితే పోస్ట్ డేటెడ్ చెక్స్ ను ఇచ్చారు. అదికూడా ఇప్పటికీ 8 లక్షలు వసూలు అయ్యాయి. నన్ను ఇంత మోసం చేసిన ఆ టీవీ ఛానెల్ వాళ్ళు నాశనం అయిపోతారు కుళ్ళి చస్తారు అంటూ శాపాలు పెట్టారు కాదంబరి కిరణ్ గారు.