Kadambari Kiran : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక డైరెక్టర్ గా, సీరియల్ ప్రొడ్యూసర్ గా అందరికీ సుపరిచితుడైన కాదంబరి కిరణ్ తన సినిమా చేదు అనుభవాలతో పుస్తకాన్ని కూడా రాస్తున్నానని చెప్పారు. కిరణ్ మొదట జర్నలిస్ట్ గా ఈనాడు లో పనిచేస్తూ ఉన్నపుడే సీరియల్స్ లో నటించారు. ఇక చాలా సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉండి చాలా డబ్బు నష్టపోయినట్లు చెప్పారు కిరణ్. కొంతమంది పెద్ద మనుషుల్లాగే ఉంటూ డబ్బు మోసం చేసారంటూ చెప్పరు కిరణ్. ఇక ఏఎన్ఆర్ గారితో చాలా అనుబంధం ఉన్న కిరణ్ గారు నాగేశ్వరావు గారి చివరి రోజుల గురించి మాట్లాడారు.

నాగేశ్వరావు గారు నాతో సన్నిహితంగా ఉండేవారు…
కాదంబరి కిరణ్ గారు సీరియల్స్ ప్రొడ్యూసర్ గా ఉంటూ బాగా నష్టపోయారు. అలా నాగేశ్వరావు గారితో చేసినపుడు ఒక సీరియల్ నష్టపోయినపుడు మళ్ళీ ఆయనే పిలిచి మరో సీరియల్ చేయమని నేను చేస్తానని చెప్పారట. అలా ఏర్పడిన అనుబంధం ఆయన చివరి రోజుల వరకూ ఉందని కిరణ్ తెలిపారు. నాగేశ్వరావు గారి చివరిరోజుల్లో ఆయనను ఎవరూ చూడటానికి అనుమతించలేదు అయితే కిరణ్ గారు మాత్రం నేరుగా వెళ్లి చూసేవారట. ఆయనతో నాగేశ్వరావు గారు మాట్లాడేవారట. నిజానికి ఉదయ్ కిరణ్ చనిపోయినపుడు కూడా నాగేశ్వరావు గారు మరణించారు కానీ బయటికి చెప్పకుండా దాచిపెట్టారు అంటూ పుకార్లు వినిపించాయని కానీ నిజానికి నేను వెళ్ళినపుడు నాగేశ్వరావు గారు ఉదయ్ కిరణ్ మరణం గురించి అడిగారు ఎందుకు చిన్న వయసులో అలా చేసాడు తప్పు కాదా అని మాట్లాడారు అంటూ కిరణ్ తెలిపారు.

ఆయన చివరి రోజుల్లో ముట్టుకుంటే చర్మం ఊడి వచ్చేది అలా అయిపోయారు అందుకే ఎవరినీ కలవలేదు. చూసినా బాధపడతారని ఆయన ఎవరినీ కలవనని చెప్పారు అంటూ కిరణ్ నాగేశ్వరావు గారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక తనకంటే ఇండస్ట్రీలో చిన్నవాళ్లు తన ముందు ఎదిగినవాళ్ళలో పూరీ ఒకడు అంటూ తాను ఇప్పుడు పెద్ధ డైరెక్టర్ అయిపోయాడు అందుకే ఓరేయ్ అని పిలవలేను, అందుకే డార్లింగ్ అని పిలుస్తా అంటూ తెలిపారు. ఇక నన్ను పెద్ధ మనుషుల ముసుగులో మోసం చేసినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళ జీవితాలు ఇప్పుడు బయట పెట్టలేను అంటూ తెలిపారు.
































