Kadapa MP Seat : పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు తర్వాత ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తున్న అంశం కడప ఎంపీ స్థానం గురించే..? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నంత ఆసక్తికరంగా టాపిక్ నడుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా గత ఎన్నికలకు కాస్త ముందు అంటే 2019 మార్చిలో జరిగిన వివేకా హత్య కేసు.. ప్రస్తుతం నెక్ట్స్ ఎన్నికలకు సరిగ్గా ముందు కీలక దశకు చేరుకోవడం. అప్పట్లో వైసీపీకి ఫేవర్‌గా మారిన అంశమే.. ప్రస్తుత ఎన్నికల్లో ఉరితాడుగా మారడం. హత్యకు గురైంది.. స్వయంగా ఏపీ సీఎం జగన్ బాబాయి. హత్య చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది.. స్వయంగా మరో బాబాయ్, తమ్ముడు అయిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి. ఇప్పటికే ఈ కేసు విచారణను ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో నడుస్తున్న హాట్ హాట్ టాపిక్.. కడప ఎంపీ స్థానం ఎవరిది..? వైసీపీ తరఫున పోటీచేసేదెవరు..? టీడీపీ నుంచి బరిలోకి దిగేదెవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

బయటి వారి నో ఛాన్స్..
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డి కూడా దాదాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ సారి కడప ఎంపీ స్థానం ఎవరిది? ఒకరకంగా బాబాయిని హత్య చేశాడన్న ఆరోపణలు అవినాశ్ రెడ్డిపై వచ్చాయి. దీంతో ఆయనపై నెగిటివిటీ పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్.. అవినాశ్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ స్థానంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 1989 నుంచి కూడా కడప ఎంపీ స్థానం వైఎస్ కుటుంబీకులదే. మరి అలాంటప్పుడు ఈసారి కూడా బయటి వారికి టికెట్ కేటాయించే అవకాశం లేదు. అయితే ఈసారి జగన్.. తన సతీమణి భారతీ రెడ్డినే బరిలోకి దింపుతారని బీభత్సంగా చర్చ నడుస్తోంది. భారతి మినహా ఈ సారి వేరే ఆప్షన్స్ కూడా జగన్‌కు లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా వైసీపీ నుంచి తప్పుకోవడంతో కడప ఎంపీ భారతీ రెడ్డిదేనని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే..
వైసీపీ నుంచి వైఎస్ భారతీరెడ్డిని అధిష్టానం బరిలోకి దింపడం ఖాయంగానే కనిపిస్తోంది. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగానే సోదరి షర్మిల, తల్లి విజయమ్మను దూరం జగన్ దూరం చేసుకున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో షర్మిల కానీ విజయమ్మ కానీ పోటీ చేసే పరిస్థితులు లేవు. పైగా షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించారు. ఆమె ఏపీకి వెళ్లే ఛాన్స్ లేదు. ఇక ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక ఆప్షన్ భారతి. నిజానికి ఈ సారి భారతీరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే ఆమె జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ ప్రస్తుత తరుణంలో భారతీరెడ్డి కడప స్థానానికి పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఒకవేళ భారతీరెడ్డి బరిలోకి దిగితే.. ఆమెకు పోటీగా టీడీపీ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉందని చర్చ బీభత్సంగా నడుస్తోంది.

సునీత పోటీ చేస్తారా..?
భారతీరెడ్డికి వ్యతిరేకంగా సునీత బరిలోకి దిగితే పరిస్థితులు బీభత్సంగా ఉంటాయి. ఎందుకంటే.. ఇద్దరూ వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారే. ఒకరైతే తండ్రిని కోల్పోయి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో సునీతకు జనాల సింపతీ బీభత్సంగా ఉంటుంది. మరి భారతీరెడ్డి తమను పాలిస్తున్న తమ ప్రియతమ నేత కూతురు. వీరిద్దరూ అక్కడి వారికి రెండు కళ్ల లాంటి వారే. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పోటీ టగ్ ఆఫ్ వార్‌గానే ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది అంచనాలకు కూడా అందడం కష్టం. కానీ సునీత పోటీ చేస్తారా? అంటే ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను బట్టి అయితే ఆమె ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా పోటీ చేయరు. ఆమెకు అసలు రాజకీయాలపై ఆసక్తి లేదని సమాచారం. కేవలం తన తండ్రి హత్య కేసులో దోషులెవరో బయటకు రావాలి.. వారికి శిక్ష పడాలి.. ఇదే సునీత ముందున్న ఏకైక లక్ష్యం. మరి చూడాలి ఏం జరుగుతుందో..!





























