Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులు చందమామ అని పిలుచుకునే ఈ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. ‘లక్షి కళ్యాణం’ సినిమాతో మొదలయి ‘చందమామ’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ‘మగధీర’ సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. టాప్ హీరోయిన్ పీఠం మీద కొన్నేళ్లు ఉన్న కాజల్ తెలుగులోనే కాక తమిళ, మలయాళం, హిందీ వంటి భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు టాప్ హీరోస్ అందరితో నటించిన కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా వచ్చింది. అయితే కాజల్ కి వచ్చినంత ఫేమ్, సక్సెస్ నీషాకు రాలేదు. దీంతో వ్యాపార వేత్త ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

కట్టప్పగా మారిన కాజల్…
ఇక కాజల్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు అందరికి షాక్ ఇస్తూ పెళ్లి చేసుకుంది. గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయ్యాక కూడా కెరీర్ కొనసాగించిన కాజల్ ఇటీవలే ఏప్రిల్ లో బిడ్డకు జన్మనిచ్చింది. మగ బిడ్డకు జన్మ నిచ్చిన కాజల్ బాబు కి నీల్ కిచ్లు అని పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ సమయంలో సినిమాలకు దూరమైన కాజల్ అభిమానులకు దూరం కాలేదు, తనకు సమబంధిచిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది.

తన ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫిట్ నెస్ కి సంబంధిచిన విషయాలను డైట్ కి సంబంధిచిన విషయాలను పంచుకునేది. ఇక బిడ్డ పుట్టాక తన బిడ్డతో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకునేది. అలాగే ఇప్పుడు కూడా నీల్ కిచ్లు పాదాన్ని తన తలపై పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో కు అభిమానులు బాహుబలి లో కట్టప్ప బహుబలి పాదాన్ని నెత్తిన పెట్టుకునే స్టైల్ తో పోలుస్తూ ఫోటోను షేర్ చేస్తున్నారు.

































