Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామల గా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి మరో చరిత్ర సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఎలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించారు.

నా భర్తని హత్య చేశారు …
ఆస్తి కోసం భర్తను తన అన్న కొడుకే చంపించాడంటూ కాకినాడ శ్యామల గారు తన భర్త హత్య గురించి వివరించారు. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు తనను తల మీద కొట్టారని వివరించారు. అయితే అంతా అయ్యాక తన మీదకు నేరారోపణ మోపారంటు చెప్పుకోచ్చారు. తన భర్తను తానే హత్య చేయించినట్లు ఆరోపణలు చేయగా కోర్థులలో ఒంటరిగానే పోరాడాను, చివరికి హత్య చేసిన డ్రైవర్ కు శిక్ష పడింది అంటూ చెప్పారు.

తన భర్త పొలం కోసం తన అన్నకొడుకు బాబ్జి ఇలా ఇదంతా చేసాడు. ఆ డ్రైవర్ అతనికి సన్నిహితంగా ఉండేవాడు. ఆయన చనిపోయాక పొలం అమ్మాలనుకున్నపుడు కూడా అమ్మడానికి అడ్డుపడుతూ ఆస్తి తనదంటూ గొడవ పడ్డాడు. హై కోర్ట్ వరకు వెళ్ళి పోరాడి ఆస్తి కాపాడుకున్నాను. ఆ పొలంను అమ్మేసి హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాను అంటూ శ్యామల తన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.































