Kalagnanam 2023 : భయపెడుతున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం… 2023 లో జరిగేది ఇదే…!

0
390

Kalagnanam 2023 : ప్రపంచంలో ఏం జరుగుతుందో ముందే తన తాళపత్ర గ్రంధాల్లో రచించిన వ్యక్తి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం ఇప్పటి పరిస్థితుల గురించి వచ్చే వింత రోగాల గురించి రాసారు. ఆయన చెప్పిన విషయాల్లో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవ్వన్నీ తెలుసుకుంటే భయం కలుగక మానదు. బ్రహ్మం గారు కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం గరిమి రెడ్డి అచ్చమ్మ వద్ద పశువుల కాపరిలాగా పనిచేస్తు రవ్వలకొండ వద్ద పశువులను ఒక గిరి గీసి అందులో ఉంచి అక్కడి కొండల గుహలో కూర్చొని కాలజ్ఞానం రాసారు. రవ్వల కొండలో కాలజ్ఞానం రాయడం వల్ల ఆ కొండలను బ్రహ్మం గారి కొండలని కూడా అంటారు. ఇక ఆయన రాసిన కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరిగే విషయాలు తెలుసుకుందాం.

2023 లో జరిగేది ఇదే…

2020 లో ఒక మహమ్మారి బారిన పడి ఎన్నో వేల మంది మరణిస్తారని బ్రహ్మం గారు ఎపుడో చెప్పారు. కరోనా వంటి మహమ్మారి వస్తుందని అయితే అది అంత సులువుగా వదిలిపెట్టదని మళ్ళీ అది వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటుందని చెప్పారు. అంటే కరోనా కొత్త వేరియంట్ల గురించి ఆయన ప్రస్తావించారు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. ఇక 2032 నాటికి ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో తెలిపారు.

ఇక ఆరు ఏళ్ళ పాప గర్భవతి అవుతుందని, ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని స్త్రీలు మానం అమ్ముకుంటారంటూ ఆయన కాలజ్ఞానంలో తెలిపారు. శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడుతాడని, దొంగ స్వాములు పుట్టుకొస్తారంటు చెప్పారు ఇలాంటి ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో తెలిపారు బ్రహ్మం గారు.