Kalyan Dev : సినిమా ఇండస్ట్రీ అంటేనే వారి జీవితాలు అంతా బయటివారికంటే భిన్నంగా ఉంటాయి. పైకి కనిపించేంత అందంగా అసలు ఉండవు. ఒకర్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నా, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా కొద్ది రోజులకే వారితో వీడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదా సహజీవనం అంటూ కలిసి ఉండటం కామన్ అయిపోయింది. నిజానికి బయటకూడా ఇలాంటి సహజీవనం అనే సంస్కృతి పెరుగుతున్నా ఇండస్ట్రీ లో మరీ ఎక్కువగా ఉంది. ఇక కొద్దిరోజులుగా మెగా ఇంట్లో మూడో పెళ్లి అంటూ తెగ వార్తలు వినిపించాయి. గిట్టని వారు పుట్టించిన పుకారని అందరూ కొట్టిపడేసారు కానీ అవి నిజమేనేనమో అని ఇపుడు అనిపిస్తోంది. మెగాస్టార్ కూతురు శ్రీజ రెండో పెళ్లి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తి చేసుకుంది ఇక కళ్యాణ్ దేవ్ కూడా మెగా అల్లుడు అనే స్టేటస్ లో సినిమాల్లో కూడా నటించాడు.

రెండో పెళ్ళికి సిద్ధమైన కళ్యాణ్ దేవ్…
ప్రేమ వివాహం తరువాత శ్రీజ రెండో సారి పెద్దలు చూసిన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఇక పెళ్ళాయ్యాక కళ్యాణ్ దేవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కొన్ని సినిమాలను కూడా మెగా అల్లుడి స్టేటస్ లో చేసాడు. అయితే ఇపుడు ఏమి జరిగిందో తెలియదు కానీ కొద్దిరోజులుగా వీరు వీడిపోతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ తన భర్త పేరును తన పేరు పక్కన తొలగించడంతో మరింత అనుమానం బలపడింది. ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుని మూడో పెళ్ళికి సిద్ధమైంది అంటూ వార్తలు వచ్చాయి.

ఇక ఇపుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ పెళ్ళికి సిద్ధపడుతుండటంతో తన పొగరు దించడానికి తనకంటే ముందే పెళ్లి చేసుకోవాలని కళ్యాణ్ దేవ్ అనుకుంటున్నాడట. తన మరదలు వరస అయ్యే తన కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తన స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పటికే శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకు విడాకులు అయిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటిలో నిజాలు తేలాల్సి ఉంది.
































