Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా వస్తున్న సినిమా బింబిసార. ‘ఎంత మంచివాడవురా’ సినిమా తర్వాత చాలా విరామంతో ఈ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. హిట్లు ప్లాపులు సంబంధం లేకుండా ఒకవైపు కమర్షియల్ సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు కళ్యాణ్ రామ్. అంతే కాకుండా నిర్మాత గా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. క్రీస్థు పూర్వం 5 వ శాతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధినేత బింబిసారుని కథతో ఒక సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ‘బింబిసార’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 5 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేశారు. నిన్న విడుదల అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమా విజుయల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.
నన్ను, తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ మీద చూస్తారు…

ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడారు. మాట్లాడటం మాత్రమే కాదు అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. బింబిసార చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఉంటుంది అని ఇంతకు ముందే చెప్పారు. అయితే ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా వుంటారా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఇలా చెప్పారు… అన్నీ కుదిరితే నన్ను, నా తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ పై చూస్తారు. దాని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, అని అభిమానులను సర్ప్రైజే చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



























