Kamal Hasan : విక్రమ్ సినిమా లోకేష్ కనగరాజన్ మాస్టర్ పీస్. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ ను తీసాడు. డ్రగ్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన తదుపరి చిత్రాల్లో మరికొంతమంది హీరోలను భాగం చేయబోతున్నాడు. విక్రమ్ సినిమా విడుదలయి బాక్స్ ఆఫీస్ వద్ద బాగా వసూళ్లు రాబడుతోంది. కమల్ హాసన్ కి చాలా రోజుల తరువాత మంచి హిట్ విక్రమ్ ద్వారా లభించింది .

నా అప్పులన్నీ తీర్చేస్తా… నచ్చినవి తింటా….
చాలా రోజుల తరువాత హిట్ అందుకున్న కమల్ హాసన్ విక్రమ్ సక్సెస్ గురించి మాట్లాడుతూ నేను 300 కోట్లు సంపాదిస్తానని ముందే చెబితే ఎవరు నమ్మలేదు. డబ్బా కొడుతున్నా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మాటలు నిజమయ్యాయి. విక్రమ్ తో వచ్చిన డబ్బులతో నా అప్పులన్నీ తీర్చేస్తాను, నచ్చినవి తింటాను, నా కుటుంబానికి, స్నేహితులకు ఏమి ఇవ్వగలనో ఇస్తాను డబ్బులన్నీ అయిపోయాక మళ్ళీ డబ్బు అయిపోయిందని చెబుతాను.

అంతే కానీ ఇతరులతో డబ్బు తెచ్చి నా డబ్బు అంటూ గొప్ప చెప్పలేను, నాకు అలంకారాలు వద్దు, నేను మంచి వాడిగా ఉండాలనుకుంటున్నాను అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక లోకేష్ కనగరాజన్ తన సినిమాటిక్ యూనివర్స్ లో తదుపరి రజనీకాంత్ తో సినిమా చేయనున్నారు. విక్రమ్ సినిమా విడుదలయి 10 రోజులు దాటినా ఇంకా వసూళ్ల జోరు తగ్గలేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 310 కోట్లు రాబట్టింది. సినిమా థియేటర్స్ లో ఇంకా బాగా ఆడుతోంది.



























