Kamna Jethmalani : కామ్న జెఠ్మలాని తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడం తో మోడలింగ్ చేస్తూ తరువాత సినిమాలలో అడుగుపెట్టింది. 2005 లో వచ్చిన ‘ప్రేమికులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే గోపీచంద్ హీరోగా వచ్చిన ‘రణం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించికుంది. తరువాత కామెడీ రోల్స్ లో కూడా నటిస్తూ వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా నటించింది. మహేష్ బాబు సైనికుడు సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అయితే కామ్న జెఠ్మలాని మెల్లగా సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్ళిపోయింది.

ఆ స్టార్ హీరో తమ్ముడు చేతిలో మోసపోయి…
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడపా దడపా సినిమాలు చేసే సమయంలో ఒక స్టార్ కామెడీ హీరో గా ఫేమస్ అయిన హీరో తమ్ముడితో కామ్న జెఠ్మలాని ప్రేమలో ఉంది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ స్టార్ హీరో తమ్ముడు కూడా సినీ ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు చేస్తూ గుర్తింపు పొందిన వ్యక్తినే. ఈ ప్రేమ జంట కొంత కాలం బాగానే ఉన్నారు కూడా.

కానీ ఆ హీరో తమ్ముడు పక్క చూపులు చూడటంతో, కథ మొత్తం అడ్డం తిరిగింది. తన చేతిలో మోసపోయాను అని తెలుసుకొని మెల్లగా ఇండస్ట్రీకే దూరం అయ్యిందట. ఈ కారణంగానే కామ్న ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది అని వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ కామ్న జెఠ్మలాని అయితే ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసుకొని సెటిల్ అయ్యింది.































