Kantharao daughter Sushila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన తోలుత నాటకాలల్లో ప్రసిద్ధి చెందిన ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రలాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక, జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన గురించి కుటుంబ విషయాలను కూతురు సుశీల రావు పంచుకున్నారు.

మొదటి భార్య కొడుకు మరణం అప్పుడు గొడవ ..
కాంతారావు గారి మొదటి భార్య పిల్లలు మరణించడంతో రెండో పెళ్లి చెసుకున్నారు. మొదటి భార్య సుశీల గారికి ఒక పాప పుట్టిన కొద్ది రోజులకు మరణించగా కొడుకు ఉండేవాడు. ఇక ఆమె మరణించాక హైమావతి అనే మరోకరిని పెళ్లి చేసుకున్న కాంతారావు గారి ఆ తరువాత ఐదుగురు సంతానం. ఆయన మొదటి భార్య కొడుకు నిమోనియా సోకడంతో డాక్టర్ కి చూపించగా ఆ డాక్టర్ జ్వరం ఏదో నిర్ధారించుకోకుండా పెన్సిలిన్ ఇవ్వడంతో ఆ అబ్బాయి మరణించడం జరిగింది. ఇక ఆ అబ్బాయి మరణించిన సమయంలో తన మేనమామ వాళ్ళు బాగా గొడవ చేశారు అంటూ సుశీల రావు చెప్పారు.

అజాగ్రత్త తో బిడ్డను చంపేసారంటు పోలీస్ కేసు వరకు వెళ్లడంటూ సుశీల గారు తెలిపారు. ఇక రెండో భార్య పిల్లలలో మొదటి కొడుకు పేరు ఆయన మొదటి సినిమాలో పాత్ర పేరు ప్రతాప్ గా పెట్టారు. ఇక రెండో అబ్బాయికి కాంతారావు గారి నాన్న గారి పేరు కేశవరావు అని పెట్టారు. ఇక కూతురు సుశీలకు కాంతారావు గారి మొదటి భార్య పేరు పెట్టారు. ఇక తరువాత పుట్టినరోజు కొడుకుకి ఆయన అమ్మ పేరు రాజేశ్వరిని రాజా గా పెట్టారు. చివరి అబ్బాయికి భార్య తండ్రి పేరు సత్యనారాయణ అని పెట్టారు. మొదటి ఇద్దరు మగ పిల్లలు చెన్నైలో ఉండగా, మిగిలిన వారు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.



























