Karate Kalyani: గత కొన్నిరోజులుగా కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం జరుగుతూనే ఉంది, రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. కరాటే కళ్యాణినే మొదట శ్రీకాంత్ ఇంటికి వెళ్లడం అతనిపై చేయి చేసుకోవడంతో అతను ఆమెను కొట్టడం దాంతో చంటి బిడ్డతో సహా కళ్యాణి కిందపడిపోవడం ఆ తరువాత శ్రీకాంత్ ని ఎస్ ఆర్ నగర్ నుండి మధుర నగర్ వరకు తరమడం ఇవన్నీ జరిగాక ఇక మరుసటి రోజు ఉదయం ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు. ఇక ఈ రచ్చ అక్కడితో ఆగకుండా మరో మలుపు తిరిగింది.

గొడవ సమయంలో కరాటే కళ్యాణి చేతిలో చంటి బిడ్డ ఉండటంతో ఫోకస్ పాప మీదకు వెళ్ళింది. అసలు ఎవరు ఆ చంటిబిడ్డను పెంచుకుంటోంది ఎందుకు కళ్యాణి దగ్గర ఉంది అని అనుమానాలు మొదలయ్యాయి. ఇక చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కళ్యాణి ఇంటిని సోదాలు చేసారు. ఇక కళ్యాణి, పసిపాప ఇద్దరు ఇంట్లో కనిపించలేదు. కళ్యాణి తల్లి విజయలక్ష్మి 12 ఏళ్ల బాబును, ఒక పసిపాపను కళ్యాణి పెంచుకుంటున్నట్లు వివరించింది. చట్టప్రకారం దత్తత తీసుకున్నట్లు వివరించింది.
అజ్ఞాతం వీడిన కరాటే కళ్యాణి…..

ఆదివారం నుండి ఎక్కడికి వెళ్లిందో తెలియని కరాటే కళ్యాణిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇక సోమవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమైన కళ్యాణి ఎక్కడికి పారిపోలేదని, అలా పారిపోయే రకాన్ని కాదని, తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్తూ పసిపాప తల్లిదండ్రులను తీసుకురావడానికి వెళ్లినట్లు చెప్పింది. ఇక తాను పిల్లలను అమ్ముకోవడంలేదని, ఎవరిని దత్తత తీసుకోలేదని తనకు చట్టాల గురించి తెలుసనీ స్పష్టం చేసింది. పాపను కొంతకాలం తరువాత దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. తనకు పిల్లలు లేరని ఆడపిల్లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ వివాదం వెనుక ఎవరున్నారో తనకు తెలుసనీ చెప్పింది. ఇక పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ పాపను పోషించుకోలేక కళ్యాణి దగ్గర ఉంచామని మేము ఇక్కడే ఉంటున్నట్లు కావాలంటే స్ట్రింగ్ ఆపరేషన్ చేసుకోండని చెప్పారు. ఇక ఈ వివాదం నెక్స్ట్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.































