Karate Kalyani : విగ్రహం ఏర్పాటు విషయంలో నిర్మాత చిట్టిబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కరాటే కళ్యాణి…!

0
142

Karate Kalyani : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం లకారం రోడ్డులో శ్రీకృష్ణుడు విగ్రహం ఆవిష్కరణ కు పూనుకోవడం, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా ఎన్టీఆర్ కృషుడు రూపాన్ని విగ్రహంగా పెట్టడం పట్ల హిందూత్వ సంఘంకి చెందిన సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదవ సంఘాలతో కలిసి విగ్రహ ఆవిష్కరణ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక ఒక ఇష్యూ ఏదైనా జరిగితే ఇరు పక్షాలను పిలిచి డిబేట్స్ పెట్టి ప్రోగ్రామ్ చేయడం మన న్యూస్ ఛానెల్స్ కి అలవాటే. ఇక ఇదే ఇష్యూ మీద కారాటే కళ్యాణి, బిఆర్ఎస్ పార్టీ నేతలు, నిర్మాత చిట్టిబాబు వంటి తదితరులతో డిబేట్ పెట్టగా అందులో కరాటే కల్యాణి చిట్టిబాబు మీద విరుచుకుపడ్డారు.

ఎంత ప్యాకేజ్ తీసుకున్నావ్…

కరాటే కళ్యాణి మాట్లాడుతూ శ్రీ కృష్ణుడి విగ్రహం ఎన్టీఆర్ రూపంలో పెట్టడానికి అంగీకరించమని, యాదవ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగుతామని, విగ్రహాన్ని కూల్చివేస్తాం అంటూ చెప్పగా చిట్టిబాబు అలాగే బిఆర్ఎస్ నాయకులు ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నావ్ అంటూ విమర్శలను గుప్పించడంతో శ్రీ కృష్ణుడి నుండి ప్యాకేజీ తీసుకున్నాను, ఆ దేవుడీకే ఇష్టం లేదు అందుకే విగ్రహం ఏర్పాటుకు మేము కాదు ప్రకృతి అడ్డుపడుతోంది అది మీకు అర్థం కావడం లేదా అంటూ ఫైర్ అయ్యారు.

ఇలాగే మాట్లాడితే హిందూత్వం కోసం ఎన్నో త్యాగం చేసిన నేను చాలా దూరం వెళ్తానంటూ ప్రొడ్యూసర్ చిట్టిబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కమ్మ మరియు యాదవ సామాజిక వర్గాల ఓట్ల కోసం మీరు ఇలా చేయడం బాగోలేదని కళ్యాణి విమర్శించారు. త్వరలోనే రాజాసింగ్ ను కూడా కలుస్తామని ఈ ఇష్యూ మీద యాదవ సంఘంను ఇస్కాన్ వారితో కలిసి ఆందోళన చేస్తామని, ప్యాకేజీ లు తీసుకుని హిందూత్వానికి కీడు చేయకండి అంటూ కరాటే కళ్యాణి విమర్శించారు.