Karate Kalyani : కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ లోని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, గొడవపడటం, తరువాత ఒక్కసారిగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ ని కొట్టడం జరిగింది. ఆ తరువాత పక్కనున్న వాళ్ళు యూట్యూబర్ శ్రీకాంత్ ను కొట్టడంతో శ్రీకాంత్ కూడా కరాటే కళ్యాణి ని చెంప పై కొట్టడం ఇదంతా తెలిసిన విషయమే. యూసుఫ్ గూడ బస్తీలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇటీవలే నటి కరాటే కళ్యాణి మరియు యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు.

ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కరాటే కళ్యాణి పై ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేసారు. ఇది ఇలా ఉండగా కరాటే కళ్యాణి పై మరొక ఫిర్యాదు నమోదు అయింది.
ట్విట్టర్ ద్వారా ఒక బాధితుడి ఫిర్యాదు…..
సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరొక కేసు నమోదైంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ గా తెలియజేసారు. గోపిక్రిష్ణ ట్విట్టర్లో ఈవిదంగా కంప్లైంట్ చేసారూ .. “కరాటే కళ్యాణి బాధితుల్లో మేం కూడా ఒకరమే. ఓ ఇంటి కొనుగోలు విషయంలో మా నుంచి 3.5 లక్షలు వసూలు చేసి మాతో ఒప్పందం చేసుకుంది” “SBIకు చెల్లించాల్సిన మొత్తాన్ని మేమే చెల్లించాలంటూ బెదిరించారు.
ఆమె పురుగుమందు తాగిన వీడియో పంపి మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేసింది. కళ్యాణి విషయంలో వెంటనే స్పందించిన షాప్ కి ధన్యవాదాలు తెలిపారు. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం”, అని తెలియజేసారరు.



























