బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లోని డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఇందులో నెగిటివ్ పాత్రలో మోనిత నటన అందరినీ ఆకట్టుకుంది. వంటలక్కతో సరి సమానంగా ఈమెకు కూడా అభిమానులు ఉన్నారు అంటేనే ఈమె పాత్ర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
నిజానికి మోనిత అసలు పేరు శోభా శెట్టి.ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ మధ్యకాలంలో శోభా శెట్టి అలియాస్ మోనిత సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన విషయాలను, హోమ్ టూర్ ను తన చానల్ ద్వారా అప్లోడ్ చేయడంతో ఈ వీడియోలు మిలియన్ సంఖ్యలో వ్యూస్ సాధించాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్న శోభా శెట్టి తాజాగా కార్తీకదీపం సీరియల్ లోని డాక్టర్ బాబు తమ్ముడుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కార్తీకదీపం సీరియల్ లో ఆదిత్య పాత్రలో నటిస్తున్నటువంటి యశ్వంత్ తో కలిసి శోభా శెట్టి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలలో వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా చనువుగా ఉండడంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో పడ్డారా.. ఇక డాక్టర్ బాబు సేఫ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. యశ్వంత్ హోమ టూర్ చేసిన సమయంలో శోభా శెట్టి ఈ ఫోటోలను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం శోభా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…