Katrina Kaif: ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడమే కాకుండా వెంటనే పిల్లలను కూడా ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా భట్ ఒకే ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం కూడా జరిగింది. ఇక నయనతార కూడా పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కూడా కంటున్నారు. అయితే తాజాగా మరొకటి కూడా త్వరలోనే తల్లి కాబోతుందని వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి కత్రినా కైఫ్ నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు.
వీరి వివాహం రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని ఒక ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగి ఏడాది పూర్తి అయినప్పటికీ ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఏ విషయం ప్రకటించకపోయినా ప్రస్తుతం ఈమె మాత్రం ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈ విషయాన్ని తెలియజేయకుండా దాచేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
తాజాగా కత్రినా కైఫ్ ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేశారు. అయితే ఈమె చాలా వదులుగా ఉన్న దుస్తులను ధరించారు. ఇలా వదులుగా ఉన్న దుస్తులను ధరించినప్పటికీ తన పొట్ట చాలా క్లియర్ గా కనిపించడంతో ఈమె గర్భం దాల్చిందని అయితే తన ప్రేగ్నెన్సీ విషయం బయటపడకుండా ఉండడం కోసమే ఇలా వదులుగా ఉన్న దుస్తులను ధరించింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే మరి నిజంగానే కత్రినా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాస్తుందా లేక తను ప్రెగ్నెంట్ కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…