Kavya & Nikhil : సెలబ్రిటీ కపుల్ అనగానే అందరికీ వారి ప్రేమ విషయాలు, ముచ్చట్లు తెలుసుకోవాలని ఉంటుంది. సినిమాల్లో అయినా, బుల్లితెర మీద అయినా కో స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అలా బుల్లితెర మీద సీరియల్స్ లో కలిసి నటించిన వ్యక్తుల పరిచయం ప్రేమలా మార్చుకొని పెళ్లితో ఒక్కటవుతుంటారు. అలాంటి సీరియల్ జంట నిఖిల్ మరియు కావ్యశ్రీలది. మా టీవిలో వచ్చిన ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర కు పరిచయమైన వీళ్ళిద్దరూ ఆ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా చేసారు. దాదాపు రెండేళ్ల పైనే వచ్చిన ఆ సీరియల్ తో పరిచయం స్నేహంగా మారి, ప్రేమించుకుంటున్నారు.

లైవ్ లో కావ్య నాన్న కు కాల్ చేసి…
ఇక ఈ సీరియల్ తరువాత ఇద్దరూ కలిసి ‘అమ్మ కు తెలియని కోయిలమ్మ’ సీరియల్ లో నటిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉండటం వల్లే మా ప్రేమ బలపడిందంటూ వివరించారు. ఇక నిఖిల్ బాగా వంటలు చేస్తాడంటూ కావ్య చెప్పారు. కావ్య జోక్ ని జోక్ లా తీసుకుంటుంది ఏ విషయం సీరియస్ గా తీసుకోవాలో తనకు బాగా తెలుసు ఈ గుణం నాకు బాగా నచ్చుతుంది అంటూ నిఖిల్, కావ్య గురించి చెప్పాడు. తనకు సర్ ప్రైజ్ చేయడం అస్సలు రాదని ఎక్కువ సేపు విషయాన్ని దాచలేదని చెప్పాడు. యూట్యూబ్ లో వచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇద్దరూ ఫన్నీ టాస్క్‌లు ఆడి ఎంటర్టైన్ చేసారు. ఇక లైవ్ లో ఒకరికి కాల్ చేసి మిస్ యూ చెప్పాలని చెబితే నిఖిల్ తన స్నేహితుడికి కాల్ చేసి మిస్ యూ అంటూ చెప్పి ఫోన్ కట్ చేసి టెన్షన్ పెట్టాడు.

ఇక కావ్య కు తన తండ్రికి కాల్ చేయమని చెప్పగా ఫోన్ చేసి “అప్పా మిస్ యూ” అంటూ ఫోన్ కట్ చేసింది. ఇక కావ్య మాట్లాడేటపుడు వాళ్ళ నాన్న ఏమైందమ్మ ఏమైందమ్మా అంటూ అనడం ఇక వెంటనే ఫోన్ పెట్టేయడంతో ఖచ్చితంగా టెన్షన్ పడుంటారని నిఖిల్ అన్నారు. ఇక నిఖిల్ కుటుంబం గురించి మాట్లాడుతూ కావ్య నిఖిల్ వాళ్ళ అమ్మ తాట తీస్తుంది నిఖిల్ కి అంటూ తగ్గేదేలే అంటూ ఫన్ చేసింది. ఇలా సరదా ముచ్చట్లతో ఒకరి పై ఒకరికి ఎంత ప్రేమ ఉందో వీళ్ళ మాటల్లోనే ఇద్దరూ చూపించుకున్నారు.



























