KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగనున్న నేపథ్యంలో, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ BRK భవన్‌కు చేరుకోనున్నారు. ఈ కీలక సమయంలో, కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా వస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు కవిత, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరారు.

ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ BRK భవన్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటు 9 మంది అధికారులకు మాత్రమే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, BRK భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా, గులాబీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే హరీష్ రావు విచారణకు వచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండటంతో, గులాబీ దళం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగనున్న నేపథ్యంలో, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ BRK భవన్‌కు చేరుకోనున్నారు. ఈ కీలక సమయంలో, కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా వస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు కవిత, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్… pic.twitter.com/EcoceOjTGG
— TeluguDesk (@telugudesk) June 11, 2025



































