తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు గత కొన్ని రోజులుగా జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు.

కేసీఆర్‌కు ఏఐజీ ఆస్పత్రిలో సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత కేసీఆర్ నందీనగర్ నివాసానికి వెళ్లారు. ఐదు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు.
గతంలో కూడా కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల జూన్ 11న కాళేశ్వరం కమిషన్ విచారణలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సుమారు గంటపాటు కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.



































