Keerthi Bhat : ఒక కెరీర్లో కష్టపడి పైకి రావాలంటే మనకు అదృష్టంతో పాటూ మనవాళ్ళ తోడు ప్రోత్సాహం కూడా ఉండాలి. అయితే అవేమి లేకపోయినా సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. చిన్న కష్టానికే క్రుంగిపోయే యువతరం ఉన్న ఈ రోజుల్లో ఒకవైపు కుటుంబాన్ని మొత్తం కోల్పోయినా నెల పాటు కోమా లో ఉండి వచ్చినా తిరిగి నిలబడి తన కంటూ ఒక కెరీర్ లో స్థిరపడి ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్న కీర్తి భట్ అందరికీ ఆదర్శమే. కీర్తి జీవితంలో జరిగిన విషాదాలు ఆమెకు జీవితం అంటే ఏంటో నేర్పించాయంటూ చెప్తోంది.

వాళ్ళు నరకం చూపించారు… అన్నం పెట్టేవాళ్ళు కాదు…
కీర్తి భట్ కుటుంబం మంగుళూరు కి చెందిన బ్రాహ్మణ కుటుంబం, కీర్తి డిగ్రీ చేస్తున్న సమయంలో ధర్మస్థలం వెళ్లి వస్తుండగా ఆక్సిడెంట్ అయి కీర్తి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని కీర్తి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక తన మామ వాళ్ల ఇంట్లో ఉన్న కీర్తి కోమా నుండి బయటికి వచ్చాక గతాన్ని గుర్తు చేసుకోడానికి ఆ తరువాత నడవడానికి కూడా సమయం పట్టింది. కానీ ఆ తరువాతే తన కుటుంబం మొత్తం చనిపోడానికి తన బంధువులే ఏదో క్షుద్రపూజ చేసారనే అనుమానం వచ్చింది. ఇక అన్ని ఆస్తులు జాయింట్ అకౌంట్స్ కావడం వల్ల కీర్తి మాత్రమే బ్రతికేలా చేసారని అనుమానం వచ్చిందట. ఇక తన మామ వాళ్ళ ఇంట్లో మామ కొడుకు టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. చదువుకోవాలని అడిగితే అన్నం పెట్టకుండా హింసించేవాళ్లట. ఇలా ఇవన్నీ భరించలేక చివరికి బెంగళూరు కి పారిపోయి రావడంతో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చి మళ్ళీ పట్టుకుని రిమాండ్ లో పెట్టి కొట్టిన సంఘటనలు ఉన్నాయని కీర్తి చెప్పింది. ఇక పోలీసులు కీర్తి అన్నం తినకుండా ఉండేసరికి కేసు అవుతుందని డబ్బులిచ్చి పంపారు.

అపుడు బెంగళూరు మేజిస్టిక్ లో అర్ధరాత్రి కూర్చునుంటే చాలా మంది వస్తావా అంటూ అడగడం ఇలాంటివి అన్నీ భరించాను, ఇక ఆ తరువాత ఉద్యోగం చేశాను కానీ చేతిలో నా చదువుకు సంబందించిన సర్టిఫికెట్స్ లేవు, దీంతో చిన్న పనిలో చేరి ఆ పైన అదే కంపెనీ లో హెచ్ ఆర్ గా జాబ్ చేశాను. ఆ తరువాత పేస్ బుక్ లో ఆడిషన్స్ ప్రకటన చూసి ‘లక్ష్మీ బారమ్మ’ అనే కన్నడ సీరియల్ కి ప్రయత్నించి విఫలమయ్యను కానీ మళ్ళీ నెక్స్ట్ ఏడాది అదే సీరియల్ లో మంచి పాత్ర చేయగలిగాను అంటూ చెప్పింది కీర్తి. ప్రస్తుతం కీర్తి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉంది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న కీర్తి ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది.



























