Khushbu Sundhar : తెలుగులో ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన ఖుష్బు ఆ తరువాత తెలుగులో కంటే తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఏకంగా తమిళ ప్రజలు ఆమెకు గుడికట్టేంత అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమాల్లో పీక్స్ లో ఉన్నపుడే డైరెక్టర్ సుందర్ ను పెళ్లి చేసుకుని హిందూ మతాన్ని స్వీకరించిన ఖుష్బు కి ఇద్దరు ఆడపిల్లలు. ఇక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఖుష్బు అటు రాజకీయాల్లో కూడా క్రియాశిలకంగా ఉన్నారు.

హాస్పిటల్ లో ఖుష్బు…
బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఖుష్బు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హాస్పిటల్ లో చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ క్షమించండి ఆలస్యంగా దసరా శుభాకాంక్షలు చెబుతున్నందుకు అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ పోస్ట్ చూసిన అందరూ ఖుష్బు కి ఏమైంది అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మంగళవారం సాయంత్రం వరకు బాగున్న ఖుష్బు కి సడన్ గా ఏమయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బు తమ్ముడు అబ్దుల్లా నటించిన సినిమా వేడుకలో చురుగ్గా పాల్గొన్న ఖుష్బు ఆ తరువాత తీవ్ర అస్వస్థత కు గురై ఆసుపత్రిలో చేరింది.
Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work.
— KhushbuSundar (@khushsundar) October 5, 2022
Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS
వెన్నెముక నొప్పితో బాధ పాడితున్న ఖుష్బు చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఖుష్బు బాగా సన్నబడి నజుగ్గా తయారైంది. సన్నగా అయిన తరువాత పలు మార్లు తను అనారోగ్యానికి గురవుతూ వస్తోంది. ఇక ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఉన్నట్టుండి సన్నగా అవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త అంటూ హితవు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఖుష్బు తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటించింది, ఇక జబర్దస్త్ లో జడ్జిగా కూడా అలరించింది.































