Categories: FeaturedMovie News

Kiran Abbavaram: కాంతార సినిమా పై స్పందించిన కిరణ్ అబ్బవరం… బాయ్ కాట్ అంటూ నెటిజన్స్ ట్వీట్స్?

  • Kiran Abbavaram: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు వినపడుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా పెద్ద ఎత్తున ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో దర్శకుడిగా హీరోగా చేసినటువంటి రిషబ్ శెట్టి పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నటువంటి కాంతార సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాపై స్పందించారు.

అయితే ఈయన చేసిన ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజెన్ల ఆగ్రహానికి గురవుతూ భారీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఇంతకీ కిరణ్ అబ్బవరం ఈ సినిమా గురించి ఎలాంటి కామెంట్ చేశారనే విషయాన్ని వస్తే.. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన కల్చర్ ను కాంతార సినిమాలో చూడటం ఎంతో గొప్పగా ఉంది అంటూ ఈయన కామెంట్ చేశారు.నిజానికి ఈయన చేసిన ఈ పోస్టులో ఏ విధమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం లేకపోయినప్పటికీ నేటిజన్లు మాత్రం దీనిని నెగిటివ్ గా తీసుకుంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Kiran Abbavaram: సినిమాలు చేయడం మానేయ్..

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ బ్రో నువ్వు కూడా సినిమాలు చేయడం మానేసి ఇలాంటివి కొత్తగా ట్రై చేయి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం.. నువ్వు చేసిన సినిమాలు కన్నా కాంతార సూపర్ హిట్ నువ్వు సినిమాలు చేయడం మానేస్తే బెటర్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏకంగా బాయ్ కాట్ కిరణ్ అబ్బవరం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago