- Kiran Abbavaram: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు వినపడుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా పెద్ద ఎత్తున ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో దర్శకుడిగా హీరోగా చేసినటువంటి రిషబ్ శెట్టి పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నటువంటి కాంతార సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాపై స్పందించారు.
అయితే ఈయన చేసిన ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజెన్ల ఆగ్రహానికి గురవుతూ భారీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఇంతకీ కిరణ్ అబ్బవరం ఈ సినిమా గురించి ఎలాంటి కామెంట్ చేశారనే విషయాన్ని వస్తే.. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన కల్చర్ ను కాంతార సినిమాలో చూడటం ఎంతో గొప్పగా ఉంది అంటూ ఈయన కామెంట్ చేశారు.నిజానికి ఈయన చేసిన ఈ పోస్టులో ఏ విధమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం లేకపోయినప్పటికీ నేటిజన్లు మాత్రం దీనిని నెగిటివ్ గా తీసుకుంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Kiran Abbavaram: సినిమాలు చేయడం మానేయ్..
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ బ్రో నువ్వు కూడా సినిమాలు చేయడం మానేసి ఇలాంటివి కొత్తగా ట్రై చేయి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం.. నువ్వు చేసిన సినిమాలు కన్నా కాంతార సూపర్ హిట్ నువ్వు సినిమాలు చేయడం మానేస్తే బెటర్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏకంగా బాయ్ కాట్ కిరణ్ అబ్బవరం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.



























