Categories: FeaturedMovie News

Srikanth Iyengar : 30 వేల కోసం కక్కుర్తి పడి ఆ సినిమా చేశా… మారుతి ఫోన్ చేసి ఆ మాట చెప్పగానే షాక్ : శ్రీకాంత్ అయ్యంగర్

Srikanth Iyengar : వృత్తి పరంగా డాక్టర్ అయినా యాక్టర్ అవ్వాలన్న కోరికతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ అయ్యంగర్ కరోనావైరస్, బ్రోచేవరెవరురా, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే సినిమాతో మంచి గుర్తింపు అలాగే అవకాశాలు అందుకున్నారు. ఇక ముక్కుసూటిగా ఉండే శ్రీకాంత్ అయ్యంగర్ ఆ స్వభావం వల్ల చాలా మంది దూరంగా ఉంటారని, కానీ మళ్ళీ తానే వెళ్లి వారితో మాట్లాడి మళ్ళీ కలిసిపోవడం అలవాటని, సినిమా షూటింగ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందని, అలవాటు పడిపోయి ఖాళీగా ఉండాలంటే కష్టంగా ఉంటుందంటూ చెప్పారు. పాత్ర ఏదైనా సరే సినిమాల్లో నటిస్తూ ఉన్నా అయ్యంగర్ తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.

ఆ సినిమా కేవలం డబ్బు కోసం మాత్రమే చేశాను…

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు శ్రీకాంత్ అయ్యంగర్. అప్పటికే ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలో నటించిన ఆయనకు ఒక సీన్ ఉంది చేయమని అడిగారట. ఆదే సమయంలో కుటుంబంతో కలిసి గోవా వెళ్తున్న శ్రీకాంత్ గారు సరే ఒక సీన్ కదా చేస్తే ఒక ముప్పై, నలభై వేలు వస్తాయి అవి గోవా ఖర్చులకు పనికొస్తాయని అనుకుని వెళ్లి చేశారట.

అయితే నాలుగు నెలలు తరువాత ఆ సినిమాలో సీన్ చూసి డైరెక్టర్ మారుతీ గారు ‘ప్రతిరోజు పండగే’ సినిమాలో అవకాశం ఇచ్చాడట. మారుతీ లాంటి డైరెక్టర్ అవకాశం అంటే ఇంకేం కావాలి అనుకుని చేసేసాను అంటూ చెప్పారు. అలా పాత్ర ఏంటి ఎంత నిడివి అని ఆలోచించకుండా పారితోషకం, డేట్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అని మాత్రమే చూసుకుంటా అంటూ చెప్పారు. తాజాగా ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రిగా నటించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago