Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

ఎవడో రివ్యూ ఇస్తే జనం రాకుండా పోరు…
ప్రస్తుతం మరో బ్రాంచ్ ఓపెన్ చేసే పనిలో ఉన్న కిర్రాక్ ఆర్పీ తన చేపల పులుసు జనాలకు నచ్చిందని ఒకసారి వచ్చినవాళ్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటూ తెలిపారు. అయితే కొంతమంది కావాలనే తప్పుడు రివ్యూలు నా చేపల పులుసు గురించి ఇస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్ళు నేను చేస్తున్న చేపల పులుసు వండేటప్పటికి నుండి ఉండి తిని అప్పుడు చెబితే బాగుంటుందని, ఒక మంచి సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినంత మాత్రాన చూడకుండా జనాలు ఉండరు.

అలానే నా చేపల పులుసుకు రివ్యూలు చూసి వచ్చే జనం అవసరం లేదు, ఒకసారి తిని నచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చే జనం కావాలి. ఇంతకుముందు జనం క్యూ కట్టేవారు ఇపుడెందుకు షాప్ ముందు లేరు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జనాలు క్యూ కట్టి నా షాప్ ముందు నిలబడటం నాకు సరదా కాదు, చాలా మందికి ఆన్లైన్ అలానే జోమోటో, స్విగ్గి వీటి ద్వారా చేపల పులుసు పంపుతున్నాము కాబట్టి షాప్ ముందు జనం కనబడటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.