Kirrak RP : జబర్దస్త్ నుండి బయటికి వచ్చి తిండి సరిగా పెట్టరంటూ విమర్శించిన ఆర్పీ ఆపైన ఫుడ్ బిజినెస్ లోకే వచ్చాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో షాప్ ఓపెన్ చేసి నెల్లూరు లో చేసే చేపల పులుసు రుచిని హైదరాబాద్ వాసులకు అందిస్తున్నాడు. మొదట కూకట్ పల్లి లో ఓపన్ చేయగా జనాల రద్దీ కారణంగా అంత సప్లై చేయలేక కొంతకాలం షాప్ మూసేసి మళ్ళీ కిచెన్ అన్నింటినీ మార్చుకుని ఎక్కువ మంది వంటవాళ్లను నియమించుకుని మళ్ళీ రీ ఓపెన్ చేసాడు. అలా ఓపెన్ చేసి మళ్ళీ సక్సెస్ అయిన ఆర్పీ మణికొండ బ్రాంచ్ ఓపెన్ చేసాడు. అది కూడా సక్సెస్ అవడంతో ఇప్పుడు అమీర్ పేట్ బ్రాంచ్ ను ఓపెన్ చేసాడు కిర్రాక్ ఆర్పీ. అయితే ఒక్కో బ్రాంచ్ లో ఎంత ఆదాయం వస్తుంది ఇప్పటికైవరకు ఎంత పెట్టుబడి పెట్టాడు అన్న విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఒక్కో బ్రాంచ్ నుండి వచ్చే ఆదాయం ఎంతంటే…
కిర్రాక్ ఆర్పీ తన అమీర్ పేట్ బ్రాంచ్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ అందరం కష్టపడి జనాలకు నచ్చే విధంగా చేపల పులుసు రుచి చూపించామని, నా ఆలోచనలకు డబ్బు పెట్టుబడి పెట్టింది నా స్నేహితుడు అంటూ చెప్పారు. ఇక పెట్టుబడి ఎంత పెట్టామనే దానికంటే ఎక్కడా రాజీ పడకుండా సుచిగా శుభ్రంగా ఉండే వంటకాలను అందిస్తూ నాణ్యతలో రాజీ పడకుండా చేస్తున్నాం అంటూ చెప్పారు.

ఇక రెండు బ్రాంచ్ ల నుండి మా ఖర్చులన్నీ పోగా మిగులుతోందని తెలిపారు. ఎంత లాభం వస్తోంది అన్నది చెప్పనంటూ కిర్రాక్ ఆర్పీ సస్పెన్సులో పెట్టాడు. ఇక ఫ్రాంచైజీ కావాలనుకుంటే ఇస్తామని నెల్లూరు చేపల పులుసు బ్రాంచ్ లు మరిన్ని ఓపెన్ చేసే ఆలోచన ఉందంటూ చెప్పారు కిర్రాక్ ఆర్పీ. ఇక అమీర్ పేట్ బ్రాంచ్ ను హీరో శ్రీకాంత్ అలాగే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓపెన్ చేయడం విశేషం.