Kirrak RP nellore chepala pulusu : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్ధారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. మీడియా పబ్లిసిటీతో కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

మూతపడిన కర్రీ పాయింట్… ధైర్యముంటే వండుకుని రండి…
జనాల డిమాండ్ కు సరిపడా వండించలేక పోయిన ఆర్పీ కర్రీ పాయింట్ ను తాత్కాలికంగా ముయించాడు. భారీగా జనం క్యూ కట్టడం వల్ల వాళ్లందరికీ సరిపడా వండించలేక పోతున్నామని చాలా మంది నిరాశతో వెనక్కి వెళ్తున్నారని అందుకే కిచెన్ కెపాసిటీ మాత్రమే కాదు వంటవాళ్ళను పెంచాలని భావించి కర్రీ పాయింట్ క్లోజ్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా నెల్లూరు నుండి మహిళలను తీసుకువచ్చి చేపల పులుసు బాగా చేసేవారితో మళ్ళీ కర్రీ పాయింట్ ఓపెన్ చేస్తామని తెలిపారు.

ఇందుకోసం ఆర్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటన ఇచ్చారు. నెల్లూరు చేపల పులుసు బాగా పెట్టే మహిళలు వాళ్ళు చేసిన పులుసు వండుకుని తాము చెప్పే అడ్రెస్ కి వస్తే ఆడిషన్స్ నిర్వహించి బాగా చేసిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. లక్షల్లో బిజినెస్ జరిగిన కర్రీ పాయింట్ డిమాండ్ కు సరిపడా సప్లై చేయలేకపోయామని మళ్ళీ రీ ఓపెన్ చెసి హైదరాబాద్ వాళ్లకు నెల్లూరు చేపల పులుసు రుచి చూపిస్తామని ఆర్పీ హామీ ఇచ్చాడు.





























