Kirrak RP : జబర్దస్త్ ద్వారా కిర్రాక్ ఆర్పి గా గుర్తింపు పొందిన ఆర్పి అసలు పేరు ప్రసాద్. తన డిఫరెంట్ స్టైల్ కామెడీతో బాగా ఫేమస్ అయ్యాడు. కారణాలు ఏవైనా జబర్దస్త్ జడ్జి గా ఉన్న నాగబాబు షో నుండి బయటకు వచ్చేసారు. ఇక ఆయనతో పాటే కిర్రాక్ ఆర్పి కూడా బయటకు వచ్చేసారు. ఆ తరువాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో చేసారు నాగబాబు ఆ తరువాత ఇపుడు మా టీవీ లో జబర్దస్త్ లాంటి షో తో మళ్ళీ ముందుకు వచ్చారు. అయితే జబర్దస్త్ నుండి వెళ్ళిపోడానికి కారణాలను ఆర్పి వివరించాడు.

పంచ్ ప్రసాద్ కు సహాయం చేయలేదు…
మల్లెమాల సంస్థల గురించి ఆరోపణలు చేసిన ఆర్పి తిండి సరిగా ఉండదని చెప్పారు. జబర్దస్త్ ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగా ఉండవని సరైన తిండి ఉండదని, గౌరవం ఇచ్చేవారు కాదని చెప్పారు. పంచ్ ప్రసాద్ విషయంలో అసలు స్పందించలేదని చెప్పారు. పంచ్ ప్రసాద్ కు కిడ్నీ సమస్య వచ్చి డయాలసిస్ చేయవల్సిన పరిస్థితి వచ్చినపుడు నాగబాబు గారు చొరవ చూపించి మీటింగ్ ఏర్పాటు చేసి అందరి చేత వసూలు చేసి ప్రసాద్ ఆపరేషన్ కు ఇచ్చాము. ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వద్ద ఉన్న మనిషికి విషయం చెప్పినా పట్టించుకోలేదు. మరుసటి రోజున ప్రసాద్ కనిపిస్తే శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు ఎలా ఉన్నావు ప్రసాద్ అని అడిగారట.

ఆరోజు నా దగ్గరకు వచ్చి పంచ్ ప్రసాద్ ఏడ్చాడు. సహాయం చేయలేదు కనీసం కానీ ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు అంటూ బాధపడ్డాడు అని అప్పటి సంఘటనలు చెబుతూ మల్లె మాల నుండి వాళ్ళను వ్యతిరేకించి బయటకు వస్తే వీరికి సినిమా ఇండస్ట్రీ లో పని దొరకదు. వాళ్ళు ఏదైనా నిర్మాణ సంస్థలు వద్దకు వెళ్లే కంటే ముందే ఫోన్లు వెళ్తాయి మల్లెమాల నుండి అంటూ చెప్పాడు ఆర్పి.


































