Kommanapalli Ganapathi Rao : తెలుగు నవలా రచయితగా రాసినవి కొన్నే నవలలు అయినా సునిశితంగా, మనసుకి నచ్చేలాగా ఆయన రచనలు ఉంటాయి. అలాగే పాఠకుల మనసును దోచుకున్నాయి. ఇక ఆయన కొన్ని సినిమాలకు కూడా రచయిత గాను సంభాషణలు అందించడం, కథ అందించడం వంటివి చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ వంటి వారు తమ గురువుగా కొమ్మనాపల్లిని భావిస్తారు. ఇక రచయితగా, సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న త్రివిక్రమ్ గురించి, ఆయన తన అనుభవాలను తాజాగా ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

తిట్టినా మారలేదు… ఇప్పటికి గుర్తుచేసుకుంటాడు…
రచయిత అయినా అదే వృత్తిగా పెట్టుకోకుండా హెచ్ఎమ్ టీ కంపెనీలో పనిచేస్తున్నా ఖాళీగా సమయంలో నవలలు రాసేవాడినని చెప్పారు కొమ్మనాపల్లి. ఇక ఓ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొమ్మనాపల్లి వద్దకు వచ్చి అసిస్టెంట్ గా ఉంటానని అడిగారట. ఇక నేను ఫుల్ టైం రచయితను కాదు నాకు అసిస్టెంట్ అవసరం లేదు అని, ఏం చదువుకున్నావ్ అని అడుగగా ఎమ్ఎస్సి గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పగా “ నీకు ఏమైనా పిచ్చా.. బాగా చదువుకున్నావ్ ఏదైనా జాబ్ చూసుకో, ఈ సినిమాల్లో దరిద్రపు రాజకీయాలు నువ్వు పడలేవు” అంటూ చెప్పారట. అయినా వినలేదట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ,ఇలా రెండు మూడు సార్లు తిట్టినా మారలేదట. ఇక చివరకు ఏమైనా ఇంతకుముందు రాసిన రచనలు, కథలు ఉన్నాయా అని అడిగితే లేవని చెప్పగా రాసుకుని రమ్మన్నారట. ఇక ఆ మరుసటి రోజే ది రోడ్ అనే కథ రాసుకొచ్చి చేతిలో పెట్టాడట. కథ చాలా అద్భుతంగా రాసాడని అర్థమయ్యాక ఆంధ్రజ్యోతి వారికి ఫోన్ చేసి కథను ప్రచురించమని అడుగగా వీక్లీ లో ఆ కథ వచ్చింది.

ఇక ఆ తరువాత మెరుపు అనే సినిమాకు అప్రెంటిస్ గా చేర్పించారు కొమ్మనాపల్లి. ఇక అక్కడి నుండి ఇపుడు టాప్ డైరెక్టర్ గా నిలిచినా తన గురువు కొమ్మనాపల్లి గణపతి రావు గారని చెబుతారట త్రివిక్రమ్. ఇక సుద్దాల అశోక్ తేజను కూడా అలాగే దాసరి గారికి పరిచయం చేస్తే ఆయనకు పాటలు నచ్చి అవకాశం ఇచ్చారట. ఇక శ్రీహరి గారి గురించి కూడా కొమ్మనాపల్లి గారు స్పందించారు. ఒక సినిమాలో శ్రీహరి గారు కొమ్మనాపల్లి గారిని అవకాశం ఇప్పించమని అడుగగా ఆయన ఒక సినిమాలో ఇప్పించారట ఆ కృతజ్ఞత ఆయనకు చాలా ఉందని చెప్పారు కొమ్మనాపల్లి గణపతి రావు గారు.
ఆ సినిమా సమయంలోనే చైతన్య పేరు ఫిక్స్…

ఇక నాగార్జునతో అరణ్య కాండ సినిమాను ఒక నవల ఆధారంగా తీసాము. అయితే ఆ కథలో పాత్ర పేరు చైతన్య. ఆ కథ నాగార్జున గారికి బాగా నచ్చడంతో ఆయన సినిమా చేసారు. ఇక ఆ సినిమాలో చైతన్య పేరు కూడా ఆయనకు బాగా నచ్చింది. చాలా బాగుంది కదా అని నన్ను అడుగగా అంతకంటే మంచి పేర్లు ఉన్నాయి కదా అంటే లేదు చైతన్య పేరు చాలా నచ్చింది, నా భార్యకి చెబుతాను నాకు కొడుకు పుడితే చైతన్య అనే పేరు పెడతాను అని ఆనాడే చెప్పారట.



























