Kona venkat: గంజాయి సేవించటం చట్టరీత్యా నేరం. గంజాయి సేవించినా, అక్రమంగా గంజాయిని రవాణా చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే చాలామంది డబ్బు సంపాదించడం కోసమే ఇలా గంజాయి రవాణా చేయడానికి సిద్ధపడతారు. ఇక ఇటీవల పుష్ప సినిమాలో ఎర్రచందనం అక్రమంగా రవాణా ఎలా చేయాలో స్పష్టంగా చూపించారు. పుష్ప సినిమా చూసిన చాలామంది అదే స్టైల్ లో మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటిని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఇదిలా ఉండగా గంజాయి రవాణా చేయడం చెట్టరీత్యా నేరం అని తెలిసినా కూడా ప్రముఖ సినీ రైటర్ కోన వెంకట్ ఎంతో రిస్క్ చేసి మరీ గంజాయి రవాణా చేసినట్లు తానే స్వయంగా వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోనా వెంకట్ మాట్లాడుతూ… తన స్నేహితుడి కోసం గంజాయి రవాణా చేయవలసి వచ్చిందని, తాను ఒక పోలీస్ కొడుకు అయినప్పటికీ ఈ పని చేయక తప్పలేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ… ఆర్థిక సమస్యల వల్ల తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. తన స్నేహితుడు ఆదిలాబాద్ నిర్మల్ అడవిని ఆనుకుని ఉండటం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయట పడటానికి గంజాయి పండించి రవాణా చేయటం మాత్రమే మార్గం అనుకున్నాడు. దీంతో 5 ఎకరాలలో గంజాయి పండించి గోవాకి రవాణా చేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తే గంజాయి విడుదల చేస్తామని పోలీసులు డిమాండ్ చేయటంతో ఆ డబ్బు చెల్లించలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Kona venkat: స్నేహితుడి అప్పు తీర్చడం కోసం….
ఈ తన స్నేహితుడి గురించి తెలుసుకున్న కోనా వెంకటేష్ హాస్పిటల్ కి వెళ్లగా అతని స్నేహితుడు జరిగినదంతా వివరించాడు. దీంతో కోనా వెంకట అతనికి సహాయం చేయాలని భావించి పోలీసులకు చెల్లించాల్సిన డబ్బు కూడా పెట్టి గంజాయిని విడిపించాడు. ఆ తర్వాత తన తండ్రి పోలీస్ అవ్వటం వల్ల ఆ వాహనంలోనే తన స్నేహితులతో కలిసి మూడు చెక్ పోస్ట్లు దాటుకుని గోవా చేరుకొని అక్కడ గంజాయిని విక్రయించినట్లు కోన వెంకట్ ఈ సందర్భంగా వివరించాడు. అయితే తన స్నేహితుడిని కాపాడటం కోసం మాత్రమే ఇలా గంజాయిని రవాణా చేసినట్లు స్పష్టం చేశాడు. తన జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా త్వరలోనే ఒక సినిమా కూడా తీయబోతున్నట్లు కోనా వెంకట వెల్లడించాడు.






























