Konda Surekha : వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ, కొండా మురళి దంపతుల గురించి తెలియని వారు ఉండరు. ఇక మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ వచ్చిన కొండా దంపతులు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జగన్ పార్టీ లో చేరి జగన్ కు అండగా నిలిచిన కొండా దంపతులు ఆ తరువాత మళ్ళీ జగన్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు చూసారు, ఇక మళ్ళీ తెరాస లో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసారు.

రాజశేఖర్ రెడ్డి మరణించే ముందు మాకు ఇచ్చిన హామీ…
దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే కొండా దంపతులకు అండగా ఉన్నారు. కొండా మురళి కి ప్రాణ భయం ఉన్న సమయంలో ఆయనే అసెంబ్లీలో ఆయన పూచీకత్తుపై గన్ మాన్ లను ఇప్పించారంటూ అప్పటి సంఘటనలను చెప్పారు కొండా సురేఖ. ఇక కొండా మురళి కి ప్రొటెక్షన్ ఇప్పించాక మళ్ళీ హత్యలు జరగడం, మురళి పై కేసులు పడటంతో మళ్ళీ సమస్యల్లో ఉన్న కొండా దంపతులు రాజశేఖర్ రెడ్డి గారిని సహాయం అడగడానికి ఆలోచించారట, అయితే ఫోన్ చేస్తే ఆయన నేనున్నానని భరోసా ఇచ్చారట. ఇక రాజశేఖరరెడ్డి గారు హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించే ముందు రోజున జరిగిన సమావేశంలో కొండా దంపతులతో మాట్లాడి వరంగల్ లో ఇక మీ రాజ్యమే జరుగుతుంది. మీదే అధికారం ఇంతకు ముందు వేరే వాళ్ళను నమ్మి మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కి కానీ నాకు కానీ లాభం జరగలేదు అందుకే మీకు అధికారం ఇస్తాను అని చెప్పారట.
ఆ తరువాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడంతో జగన్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులందరూ సంతకాలు చేసినప్పుడు ఒకవేళ జగన్ సీఎం కాకపోతే రాజీనామా చేస్తామని చెప్పడం వల్ల ఆయన సీఎం కాకపోవడంతో రాజీనామా చేసాము. ఆ సమయంలో జనంలో వచ్చిన ఆవేశాన్ని చూసాక జగన్ కు పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చిందని ఒక రకంగా ఆయన పార్టీ పెట్టడానికి మేమే కారణమని చెప్పారు.

ఇక ఆయన పార్టీ పెట్టి ఓదార్పు యాత్ర చేసిన సమయంలో తోడుగా నిలిచాము. అయితే తెలంగాణ ఉద్యమం జోరుగా జరిగిన తరుణంలో పార్టీ నుండి తెలంగాణ కు మద్దతుగా ప్రకటన రాకపోవడం, జగన్ జైలులో ఉండటంతో పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి వెళితే కిరణ్ కుమార్ రెడ్డి డ్రామా చేసారు. ఇక కెసిఆర్ పిలుపు మేరకు తెరాస లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేశాను అంటూ అప్పటి విషయాలను పంచుకున్నారు.





























