Konda Susmitha Patel : వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు లేని రాజాకీయం లేదు. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీలో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళిని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యా యత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి రాజకీయాల్లోకి రావడం గురించి కొండా సుస్మిత మాట్లాడారు. అలానే వారికి ప్రధాన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

కుల అహంకారం ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు…
కొండా సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన తండ్రి కొండా మురళి ఎపుడో పటేల్ అనే పేరును తన పేరు నుండి తొలగించుకున్నారని అయితే తనకు పటేల్ అని ఉండటానికి కారణం ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడారు. సుస్మిత కు తన తోమ్మిదేళ్ల వయసులోనే తన తాతయ్య పటేల్ ను పేరు వెనుక చేరస్తూ ఇది నువ్వు మీ నాన్నలాగా తీసేయొద్దు అని చెప్పారట. అందుకే తన పేరు వెనుక పటేల్ ఉంటుందని అయితే కుల అహంకారం లేదంటూ తెలిపారు.

ముప్పై ఏళ్లుగా తన తల్లిదండ్రులు రాజకీయం చేస్తున్నారని కనుక అహంకారం ఉంటే రాజకీయాల్లో ఏదగేవారు కాదని చెప్పారు సుస్మిత. తెలంగాణ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ అని కులం కార్డుతో రాజకీయాలు జరగవంటూ తెలిపారు. ఇక తన రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ వరంగల్ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. ఇక వరంగల్ లో ఎర్రబెల్లి దాయకరావు ఓటమి మా లక్ష్యం అంటూ చెప్పారు సుస్మిత.





























