Koratala Shiva: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. ఎంతోకాలంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ రావటంతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కిస్తున్న సినిమాలలో నటించడానికి గొప్ప గొప్ప నటీనటులను తీసుకోవటానికి దర్శకులు ఆసక్తి చూపుతారు. కానీ కొరటాల మాత్రం వాటికి విరుద్ధంగా సీరియల్ నటీనటులను ఈ సినిమాలో భాగస్వాములను చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ 30 సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సైఫ్ అలీ ఖాన్ కి భార్యగా సీరియల్ నటి చైత్ర నటిస్తున్నట్లు ఆమె ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..అయితే ఈ విషయం తెలియటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ 30 లో సీరియల్ నటినటులు ఏమిటా అని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరొక సీరియల్ నటి ఎన్టీఆర్ 30లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ లో నటించిన మని చందన ఈ సినిమాలో జాన్వి కపూర్ తల్లి పాత్రలో నటిస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగు కన్నడ తమిళ్ భాషలలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ వార్త బయటికి రావటంతో నువ్వు సినిమా తీస్తున్నావా? లేక సీరియల్ తీస్తున్నావా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు కొరటాలపై విరుచుకుపడుతున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…