Koratala Siva : ఆచార్య సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇద్దరు పెద్ద హీరోలు, అందునా మెగాస్టార్ తన తనయుడితో మొదటి సారి కలిసి నటించడం, దీంతో సినిమా మీద అంచనాల నడుమ సినిమా ప్లాప్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకూ ఓటమి చూడని దర్శకుడు కొరటాలకు మొదటి పరాజయం. అదీకాక సినిమా మొదటి రోజు వసూళ్లు రాకపోవడం విడ్డూరం. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు పెద్ద హీరో సినిమాలకు కలెక్షన్స్ కచ్చితంగా ఉంటాయి. అభిమానులు మొదటి రోజు సినిమాకు వెళ్లడమే కారణం. కానీ ఆచార్య విషయంలో మరి మొదటి రోజు కూడా వసూళ్లు రాకపోవడం విశ్లేషకులను, సీనియర్ నిర్మాతలు, డైరెక్టర్స్ ను కూడా ఆశ్చర్య పరిచింది.

సినిమా ప్లాప్ అయి నింద కొరటాల మీద…
సినిమా డిజాస్టర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలను అన్న చందంగా ఆచార్య ప్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ సినిమా ప్లాప్ అవ్వగానే మెగా అభిమానులు నింద మాత్రం కేవలం కొరటాల మీదకు నెట్టేసారు. సినిమా సరిగా స్క్రీన్ ప్లే లేదని కథ సరిగా క్యారీ చేయలేదంటూ విమర్శించారు. కానీ ఒక్క దర్శకుడినే అలా నిందించడం ఎంత వరకూ సరైంది. అంతవరకూ హిట్లు ఉన్న కొరటాల కు డైరెక్షన్ తెలియక సినిమా ప్లాప్ అయ్యిందా అన్నట్లు గా ఆయనను ట్రోల్ చేసారు. ఇక నష్టపోయిన డిస్టిబ్యూటర్లు చిరంజీవిని, కొరటాలను నష్టపరిహారం అందించాలని కోరుకున్నారు.

Trend successful ????#JusticeforKoratalaShiva pic.twitter.com/ARhvgyBAf8
— …. (@thalabheem33) July 15, 2022
ఇక కొరటాల వారికి హామీ కూడా ఇచ్చారు రికవరీ చేయిస్తానని. ఇక తాజాగా మరోసారి డిస్ట్రిబ్యూటర్లు ఆయనను కలిసి నష్టం పుడ్చాలని అడిగారు. దీనికి ఆయన త్వరలోనే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇపుడు ఈ విషయం బయటకు రావడంతో కొరటాల అభిమానులు కొరటాల ను మాత్రమే నిందించడం కరెక్ట్ కాదని ట్విట్టర్ లో # justice for koratalasiva ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీనికి ఎన్టీఆర్, మహేష్ అభిమానులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. కొరటాలను మాత్రమే నిందించకూడదని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ కొరటాల డైరెక్షన్ చేసుకోకుండా బిజినెస్ లో వేలు పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ ట్రోల్ చేస్తున్నారు.


































