Kota Srinivasa Rao : విలన్ గా కామెడీ విలన్ గా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750 సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బాబు మోహన్ కోటా గారి కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో సినిమాకు మినిమమ్ గ్యారెంటీ అనేంతలా వారి పాత్రలు ఉండేవి, కామెడీ పండేది. ఇక సీరియస్ విలన్ గా కూడా రాణించిన కోటా గారు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, ఎమ్మెల్యే గా పనిచేసారు. ఇక ఇపుడు వృధాప్య సమస్యలతో సినిమాలలో పెద్దగా కనిపించని కోటా గారు ఇండస్ట్రీ గురించి ఇప్పటి తరం నటుల గురించి ఆయన అభిప్రయాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

అవకాశాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫోన్లు…
వృధాప్యంలో ఉన్న కోటా గారు సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను సినిమాల్లో ఏవైనా అవకాశాలు ఉంటే ఇవ్వండని డైరెక్టర్లకు, నిర్మాతలకు ఇలా ఎవరైనా కనిపిస్తే అడుగుతున్నారట. అందులో తప్పేముంది నాకు ఖాళీగా ఉంటే పిచ్చెక్కుతోంది అందుకే ఏదైనా సినిమాలో నటించాలి పనిచేయాలి అనుకుంటున్నాను. దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి వంటి వారు కనిపిస్తే అవకాశం ఇవ్వండని అడుగుతుంటాను.

ఇక మహేష్ బాబు కనిపిస్తే నాకు సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడిగితే అదేంటండీ మీలాంటి వారు అలా అడగడం ఏంటి అంటూ అన్నాడు. ఇక ఎన్టీఆర్, నాని ఇలా ఎరైనా నాకు ఎదురుపడితే అడుగుతాను అందుకు ఏమాత్రం మొహమాటపడను. అందులో ఏ తప్పు లేదు అని చెబుతూ పాత సినిమాల్లో హాస్యం ఉండేది ఇప్పటి సినిమాల్లో కామెడీ ఉంటోంది అంతే తేడా. హాస్యం ఎక్కడైనా ఎవరి ముందైనా నవ్వుకోవచ్చు కానీ ఇపుడున్న కామెడీ అలా కాదు అంటూ చెప్పారు. ఇక అప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా కూడా చెప్పారు. తల్లి పాలకు, డబ్బా పాలకు ఉన్న తేడా ఉంది అంటూ స్పందించారు కోటా గారు.































