Kota Srinivasa Rao : విలనిజంలో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోటా గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకులో ఉద్యోగంలో ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన సినిమా కెరీర్ విశేషాలను చెబుతుంటారు.

బాబు మోహన్ తో ఎక్కువ క్లోజ్…
కోటా గారు తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ అప్పట్లో బాబు మోహన్ తో ఎక్కువ కాంబినేషన్స్ చేసానని బ్రహ్మానందంతో సినిమాల్లో ఎక్కువగా నటించినా కాంబినేషన్ సీన్స్ తక్కువగా పడేవని తెలిపారు. అయితే బాబు మోహన్ ను ఎక్కువగా కాలితో తన్నే సీన్స్ ఉండేవని ఎపుడూ నిజంగానే కొట్టలేదని చెప్పారు. బాబు మోహన్ మంచి టైమింగ్ ఆర్టిస్ట్ అంటూ కితబిచ్చారు. కొట్టే సీన్ లో నేను కాలు టచ్ చేయకపోయినా కరెక్ట్ టైం కి కింద పడేవాడు.

ఇక తన డాన్స్ కూడా బాగుటుంది అంటూ తెలిపారు. ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ట్రైన్స్ లో ఎక్కువగా షూటింగ్స్ కి వేరే ఊళ్ళు వెళ్ళినపుడు ఒక్కసారి రిజర్వేషన్ ఉండకపోతే బాత్రూం వద్ద ఉండే చెక్క బళ్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటపుడు నువ్వు నాకన్నా పెద్ధ వాడివి నువ్వు పైన పడుకో అన్న నేను కింద పడుకుంటా అని చెప్పేవాడు. ఇద్దరం ఒకే కంచంలో భోజనం చేసేవాళ్ళం, నేను ముద్దలు కలిపి పెట్టేవాడిని. మా బంధం అలా ఉండేది అంటూ కోటా గారు తెలిపారు.