KR Vijaya : అప్పట్లో సొంత విమానం కలిగిన మొట్టమొదటి నటి కెఆర్ విజయ.. ఆమె ఎంత సంపన్నురాలో తెలుసా?

0
872

KR Vijaya : పాత తరం హీరోయిన్లలో అందానికి, అభినయానికి పుత్తడిబొమ్మ లాంటి నటి కే .ఆర్. విజయ. ఈవిడ అసలు పేరు దేవ నాయకి. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ లో ఫిబ్రవరి 19, 1947 న జన్మించారు. తన తండ్రి అచ్చ తెలుగు వారు, వారిది చిత్తూరు. కే .ఆర్. విజయ వారి తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. ఆమెకు మొత్తం నలుగురు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈవిడ త్రిశూర్ లోని పున్కున్నం సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. అయితే ఆవిడ తండ్రి ఓ మంచి నటుడు, కళాభిమాని కావడంతో అప్పట్లో ప్రముఖ నటుడు రాధా కృష్ణన్ ఓ డ్రామా కంపెనీ స్థాపించడంతో అందులో దేశ భక్తి పూర్వక నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. దీనితో కే .ఆర్. విజయ కు కూడా నటన పట్ల ఆసక్తి కలిగింది. దీనితో ఆమె తన 17 వ ఏటనే విజయ తమిళ దర్శక నిర్మాత కె ఎస్ గోపాలకృష్ణన్ అమర్ జ్యోతి పథకం మీద నిర్మించిన కర్పగం అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు.

ఇలా ఉండగా 1964లో గోపాలకృష్ణన్ ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ చిట్ ఫండ్ కంపెనీ యజమాని వేలాయుధన్ కు మంచి మిత్రుడు. అయితే ఆ చిత్రంలో హీరోగా శివాజీ గణేషన్ నటించగా హీరోయిన్ గా సావిత్రి తో పాటు కె.ఆర్.విజయ కూడా నటించారు. ఆ సమయంలోనే కె.ఆర్.విజయ వేలాయుధన్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రణయానికి దారితీసి ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారు అప్పట్లోనే. ఆ విషయం కొంత కాలం రహస్యంగానే ఉన్న వారిద్దరూ ఓ సారి కొలంబోకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు విజయ అభిమాని ఒకరు ఫోటో తీసి దానిని బహిర్గతం చేయడం తో కె.ఆర్.విజయ వేలాయుధన్ వివాహం అందరికీ తెలిసిపోయింది. విజయ భర్త వేలాయుధన్ తమిళం, మలయాళం భాషల్లో 60కి పైగా సినిమాలను నిర్మించాడు. అలాగే తన భర్త సహకారంతో కె.ఆర్.విజయ ఏకంగా పది సంవత్సరాల్లో 100 సినిమాలకు పైగా నటించారు. ఇప్పటి కూడా ఆవిడ తల్లి, భామ పాత్రలో తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

1954 సంవత్సరం నుండి సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి యజమానిగా, అలాగే అశోక బ్రదర్స్ పేరిట ఉన్న కొన్ని ఓడలు, బెంగుళూరు నగరాల్లో స్టార్ హోటల్లో అధిపతిగా ఉన్న వేలాయుధన్ కోట్లకు అధిపతి కావడంతో విజయ తల్లిదండ్రులు ఆ వివాహానికి ఎటువంటి అడ్డుచెప్పలేదు. కాకపోతే అప్పటికే వేలాయుధన్ కు శారద, విలసిని అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. విజయ వేలాయుధన్ కు మూడో భార్య. అయితే అప్పట్లోనే వేలాయుధన్ సొంత విమానం ఉండేదంటే ఆయన ఎంత కోటీశ్వరుడు మనం గ్రహించవచ్చు. ఆ విమానాన్ని వేలాయుధం తన భార్య విజయకు వివాహ బహుమతిగా ఇచ్చాడని ఆమె అభిమానులు చెప్పుకునేవారు. కె ఆర్ విజయ కు వేలాయుధం కు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు హేమలత. నిజానికి వివాహం తర్వాత కె.ఆర్.విజయ సినిమాల్లో స్వస్తి చెబుదామనుకున్నా… దానికి భర్త వాదించి ఆమెను సినిమాల్లో నటించేందుకు తగు ప్రోత్సాహం ఇచ్చాడు. దానికి కారణం ఆయన సినీ నిర్మాత కాబట్టి.