Krishna vamsi: గులాబీ, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన 2017 లో వచ్చిన నక్షత్రం సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను చేయలేదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇకపోతే ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కృష్ణవంశీ రవితేజ ఈ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ ముగ్గురు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసే సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే కృష్ణవంశీ రవితేజకు ఎన్నో మంచి అవకాశాలను ఇప్పించారు.ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా 25 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా నిన్నే పెళ్లాడతా సినిమా గురించి యాంకర్ పలు ప్రశ్నలు అడగగా కృష్ణ వంశీ కూడా ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ రవితేజ గురించి ప్రశ్నించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలోని రవితేజ మాస్ ఎలిమెంట్ కనిపించింది. రవితేజను చూడగానే ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారు ఎవరు అని మాట్లాడుకున్నారు. ఆయనని మీరే అలా చూపించారా.. లేక ఆయనే అలా చేశారా అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా యాంకర్ రవితేజ గురించి కృష్ణవంశీని ప్రశ్న అడగడంతో వెంటనే కృష్ణవంశీ నెక్స్ట్ క్వశ్చన్ అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. ఇలా కృష్ణవంశీ కనీసం రవితేజ గురించి మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఎంతో స్నేహంగా ఉండే కృష్ణవంశీ రవితేజకు ఎక్కడ చెడింది ఇలా కనీసం తన పేరు కూడా పలకడానికి ఇష్టపడనంతగా వీరి మధ్య విభేదాలు ఏం వచ్చాయనీ ప్రస్తుతం వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏదిఏమైనా కృష్ణవంశీ రవితేజ గురించి మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…