Krishna Vamsi : చాలా రోజుల గ్యాప్ తరువాత రంగ మార్థండా సినిమాతో మళ్ళీ రాబోతున్న కృష్ణ వంశీ తన ముందు సినిమాల గురించిన విషయాలను విశేషాలను చెప్పారు. గులాబీ సినిమాతో మొదలైన సినిమా ప్రయాణం నిన్నేపెళ్లాడుతా, సముద్రం, అంతఃపురం, ఖడ్గం, మురారి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన సినిమాలో సామాజిక అంశాలతో పాటు కుటుంబ విలువలను చూపేందుకు కృష్ణ వంశీ ఇష్టపడుతాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆశించినంత విజయాలను అందుకోలేని కృష్ణ వంశీ మళ్ళీ ఒక కొత్త కథాంశం తో సినిమా చేయబోతున్నాడు. ఇక తన ముందు సినిమా విశేషాలను ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

అనంతఃపురం లో ఆ సీన్ కి చాలా టెన్షన్ పడ్డాను…
అనంతఃపురం సినిమా సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, జగపతి బాబు సినిమా కెరీర్ లోనే ఒక మైలురాయి. ఆ సినిమా కథ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుంది అందులోని పాత్రలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ని శారద గొడవకు వెళ్లకుండా ఆపే సీన్ లో నిప్పంటించుకునే సన్నివేశం గురించి కృష్ణ వంశీ మాట్లాడారు. ఆ సన్నివేశానికి చాలా కష్టపడ్డామని, రెండు షాట్స్ గా సీన్ చేద్దామని శారద అనగా నేను లేదు ఎనర్జీ పోతుంది ఒకే షాట్ లో తీద్దామని చెప్పడంతో ఆమె చేసారు. సింగల్ షాట్ కి ఓకే అయింది సీన్.

ఆ సీన్ లో శారద గారి చీరకు నిప్పంటించుకోవాలి, అప్పుడే మాకు టెన్షన్ మొదలయింది అక్కడికీ ప్రకాష రాజ్ కి చెప్తూనే ఉన్నా, హింట్ ఇస్తున్నాను. శారద గారి పార్ట్ అవ్వగానే నిప్పుని అక్కడ ఉన్న నీళ్లతో అర్పేయాలి వెంటనే నువ్వు అంటూ చెప్పాను, సీన్ అయ్యేవరకు చాలా టెన్షన్ పడ్డాము. అయితే ఒకే షాట్ లో సీన్ వచ్చింది. శారద గారు చాలా గ్రేట్ నటి అందుకే అలాంటి సీన్ సింగల్ షాట్ లో చేసేసారు. ఇంకో షాట్ చేయడానికి నను ఇష్టపడలేదు, ఆవిడా ఇష్టపడలేదు అని చెప్పారు. ఇక కృష్ణ వంశీ గారు కుటుంబానికి చాలా వాల్యూ ఇస్తారు. అందుకే తమను డైరెక్టర్ మంచి పొజిషన్ లో ఉన్నపుడు తమ్ముడికి ముప్పై ఎకరాలు భూమి కొని రాసి ఇచ్చి పెళ్లి చేశారట. అయితే ఈ విషయం లో నేనేమి గొప్పగా అనుకోను అది నా బాధ్యత నా తమ్ముడిని చూసుకోవడం నేనేమి దేశానికి ఉపయోగపడే పని చేయలేదు అంటూ చెప్పారు.



























