Krishnam raju : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. 1966 లో ‘చిలక గోరింక’ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించిన కృష్ణంరాజు 60 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ను కొనసాగించాడు. ఇప్పటి వరకు 185 చిత్రాలకు పైగానే ఆయన నటించారు. హీరోగానే కాకుండా, విలన్ పాత్రలలోనూ, సహాయక పాత్రలలోనూ నటించి మెప్పించారు. కృష్ణంరాజు గారు ఆఖరుగా రాధే శ్యామ్ సినిమాలో నటించారు. అయితే ఇన్నేళ్ల సినీ రాజకీయాలలో రాణించిన కృష్ణంరాజు గారు ఆస్తులు కూడా బాగానే సంపాదించారు. ఈయన మరణించిన తరువాత తన ఆస్తుల గురించి సోషల్ మీడియా వేదికగా చాలా వార్తలు వస్తున్నాయి.

ఖరీదైన ఇల్లులు, లగ్జరీ కార్లు…
కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సంపున్నుల కుటుంబంలో జన్మించాడు. అందుకే ఆయనకు వారసత్వంగా వందల ఎకరాల భూమి వచ్చిందంట. దీనితో పాటు వారి సొంత ఊరిలో పెద్ద ఇల్లు, చెన్నై, హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లులు కూడా ఉన్నాయట. ఇక ప్రస్తుత నివాసం అయిన జూబ్లీహిల్స్ లోని ఇల్లు సుమారు రూ. 18 కోట్లు ఉండవచ్చని సమాచారం. ఈ జాబితాలో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. కృష్ణంరాజు దగ్గర 90 లక్షల రూపాయలు విలువైన మెర్సిడెజ్ బెంజ్, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ.90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి.

వీటితో పాటు హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. 2009 లోకసభ ఎన్నికలలో కృష్ణంరాజు తనకు రూ.8.62 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. వీటితోపాటు కుటుంబసభ్యుల పేరు మీద బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అప్పట్లోనే కృష్ణం రాజు ఇంట్లో 4 కేజీల బంగారు కూడా ఉందట. ఇప్పటి లెక్కల ప్రకారం ఆస్తులు 200 నుండి 300 కోట్లు ఉండవచ్చని అంచనా. అయితే ఈ లెక్కలు అన్నీ ‘మై నేత. ఇన్ఫో’ వెబ్ సైట్ లో చెప్పబడినవి. ఇక మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బాగా సంపాదిస్తున్నారు.

































