Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో 180 కి పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా రక్త సరఫరా సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అయితే శనివారం నాడు కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి ఆయన ఊపిరితిత్తుల పనితీరు మందగించింది.

ఏఐజి హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి డాక్టర్లు అతనిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున 3.30 నిమిషాల ప్రాంతంలో గుండెపోటుతో ఆయన తుది విశ్వాస విడిచాడు. కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణంరాజు సినీ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించాడు.
ఇలా మంచి మనసున్న వ్యక్తిగా మంచి పేరు పొందిన కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు పార్థివ దేహాన్ని దర్శించి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కృష్ణమరాజు అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Krishnam Raju: కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించిన ప్రమోద్..
పండితుల సూచన మేరకు అంత్యక్రియలను కొంత సమయం వాయిదా వేసి ఒంటిగంట తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కృష్ణంరాజు అంత్యక్రియలు మాత్రం ప్రభాస్ సోదరుడు ప్రబోద్ చేతుల మీదుగా జరగనున్నట్లు సమాచారం. అయితే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైనటువంటి మెయినా బాద్ ఫామ్ హౌస్ లో నిర్వహించాలని భావించారట. తమ అభిమాన నటుడు చివరి చూపు కోసం ఎంతోమంది అభిమానులు తరలి వచ్చారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో ఈయన అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.






























