Kutty Padmini : పాత సినిమా ‘లేతమనసులు’ లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…”పిల్లలూ దేవుడు చల్లని వాడే” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడు కు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మూడవ ఏటానే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేకపోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ పలు సినిమాలను, సీరియల్స్ ను నిర్మించారు.

నా భర్త నా సెక్రటరీతో అలా చేసేసరికి…
మూడేళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన కుట్టి పద్మిని తండ్రి అనారోగ్యం వల్ల సినిమాలో నటించాల్సి వచ్చిందట. ఇక తండ్రి కోలుకున్నాక ఆర్థిక ఇబ్బందులేమీ లేకపోవడం వల్ల సినిమాలో నచ్చితేనే చేయడం లేకపోతే వదిలేయడం వల్ల హీరోయిన్ గా రానించలేకపోయానని, కొంతమంది కమిట్మెంట్ అడిగేవారని అలాగే ఎక్స్పోసింగ్ అడిగేవారని, అలాంటివి చేయడానికి ఇష్టం లేక చాలా అవకాశాలు వదులుకున్నానాని తెలిపారు.

అయితే నిర్మాతగా 23 ఏళ్లకే వ్యవహరించానని, నన్ను కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్స్ కే అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆఫర్ ఇచ్చి సీరియల్స్ తీశానంటూ చెప్పారు. ఇక తాను మిగతా వారితో పోలిస్తే హీరోయిన్ గా చేయలేక పోయిండవచ్చు కానీ సీరియల్స్ ద్వారా ఎంతో సాధించానని చెప్పారు. అయితే తన వైవాహిక జీవితం మాత్రం అలా అవుతుందని ఊహించలేదంటూ చెప్పారు. తన భర్త పెళ్ళైన 22 ఏళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నా సెక్రటరీ తోనే ప్రేమ వ్యవహారం నడిపాడు. తప్పు జరిగిపోయిందని సర్దుకుంటే ఉండేవాడు, తప్పు చేసాడు నేను ఒంటరిగా అయిన ఉంటాను కానీ అలాంటివాడు వద్దానుకున్నాను కాబట్టి ఒంటరిగా మిగిలాను అంటూ చెప్పారు. అయితే తనకు ఇద్దరు పిల్లలే జీవితం అంటూ చెప్పారు పద్మిని.

































