Kutty Padmini : పాత సినిమా ‘లేతమనసులు’లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా. “పిల్లలు దేవుడు చల్లని వాడే” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడుకు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. తన మూడ ఏటనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేకపోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నటిగా కొనసాగుతూనే నిర్మాతగాను పలు సినిమాలను సీరియల్స్ ను నిర్మించారు.

అమ్మ, సావిత్రమ్మ మంచి స్నేహితులు…
కుట్టి పద్మిని గారు మూడు నెళ్ల వయసులోనే సినిమాల్లో నటించేసారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన తల్లి ఒక పర్షియన్ అంటూ తెలిపారు. తండ్రి అయ్యంగర్. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇక తల్లి రాధ కూడా ఎన్నో సినిమాలలో నటించారు. అలా ఇండస్ట్రీతో పరిచయాలు ఉండటం వలన సావిత్రి గారు మంచి స్నేహితురాలు అంటూ తెలిపారు. తన తల్లి సావిత్రి గారు రోజూ కలిసేవారని, ఒకరోజు సావిత్రి గారు మా అమ్మ రాధతో కలిసి జెమిని గణేశన్ గారి సినిమా షూటింగ్ కి వెళ్లారు.

ఆ సమయంలో నేనింకా మూడు నెలల పసికందు. అయితే షూటింగ్ లో ఎవరు ఎత్తుకుంటున్నా వెళ్లిపోయానట అంటూ కుట్టి పద్మిని చెప్పారు. ఇక జెమిని గణేశన్ గారి సినిమా షూటింగ్ లో ఒక చిన్నారి ఉయ్యాలలో ఉండాలి అయితే షూటింగ్ కని తెచ్చిన పిల్లలు బాగా ఏడ్చే సరికి నన్ను జెమిని గణేశన్ గారు ఎత్తుకుని ఈ పాప అందరి దగ్గర ఉంది తనని షూటింగ్ కి తీసుకుందాం అని చెప్పి అలా సినిమాలో రంగప్రవేశం జరిగిందంటూ తెలిపారు.



























