Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడంటూ చెప్పే లక్ష్మి పార్వతి బాలకృష్ణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను మాట్లాడారు.

మా కుటుంబంలో డబ్బు ఖర్చు పెట్టరు…
లక్ష్మి పార్వతి గారు తారకరత్న మృతి అలాగే ఆయన హాస్పిటల్ చికిత్స గురించి ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ఇక తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయ లో చికిత్స తీసుకున్నారు. అక్కడ హాస్పిటల్ బిల్ మొత్తం బాలకృష్ణ నే చూసుకున్నాడు అంటూ వచ్చిన వార్తల మీద లక్ష్మి పార్వతి మాట్లాడుతూ హాస్పిటల్ బిల్ కట్టింది విజయ సాయి రెడ్డి అంటూ మాట్లాడింది. మా కుటుంబంలో డబ్బు పెట్టాలంటే ఆలోచిస్తారు.

ఆయనే కాదు పిల్లలు అంతే. అయినా మా కమ్యూనిటీ లోనే అంతా మనీ మైండెడ్ గా ఉంటారు, ఖర్చు పెట్టలేరు. తారకరత్న హాస్పిటల్ ఖర్చు విజయ సాయి చూసుకున్నాడు. ఇక అలేఖ్య రెడ్డికి తండ్రి ఆమెకు ఇల్లు ఇచ్చాడు అందులోనే వాళ్ళు ఉండేవాళ్ళు. నందమూరి కుటుంబంలో ఎవరూ ఏమీ చేయలేదు. బాలకృష్ణ చొరవ చూపి డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మోహన్ కృష్ణ తో మాట్లాడి ఆ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించాలి అంటూ చెప్పారు.

































