తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 46 మంది కరోనా బారిన పది మరణించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,81,640కి చేరుకున్నాయి.

మరోవైపు కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,625కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 73,851 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,122 మంది ఉన్నారు. దీనితో మొత్తంగా 4,05,164 మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకున్నారని ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

































