Lavanya Tripati : ఉత్తరాఖండ్ కు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతోంది. దీంతో లావణ్య బ్యాక్ గ్రౌండ్ అలాగే ఆమె ఎలా కెరీర్ లో సక్సెస్ అయింది వంటి విషయాలు ఇప్పుడు చాలా మంది నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో 1990 డిసెంబర్ 15న జన్మించిన లావణ్య త్రిపాఠి చదువుయ్యాక మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. కుటుంబంలో అందరూ ప్రభుత్వం ఉద్యోగులు కాగా లావణ్య మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. చదువుకునే సమయంలోనే ఫెమినా మిస్ ఉత్తరాఖండ్ గా నిలిచింది. దాంతో వాణిజ్య ప్రకటనలలో కొద్దిగా కనిపించింది.

తెలుగువారి అందాల రాక్షసి…
లావణ్య సినిమాల్లో నటించాలంటే ముందు బుల్లితెర మీద కనిపిస్తే బాగుంటుందని భావించి మొదట 2009లో ‘ప్యార్ కా బంధన్’ అనే టీవీ సీరియల్ లో నటించింది. ఆ పైన సిఐడి వంటి పలు సీరియల్స్ లో నటించిన ఆమె సినిమా ఆఫర్స్ రాకపోవడంతో కొద్ది రోజులు ఖాళీగా కూడా ఉంది. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చూసుకుంటూ ఉన్న ఆమెకు ‘అందాల రాక్షసి’ సినిమా ఆడిషన్ కి వెళ్ళమని స్నేహితులు సూచించారు.

అలా వెళ్లిన తాను మేకప్ లేకుండా ఆడిషన్ ఇవ్వగా సెలెక్ట్ అయి మిథున పాత్రలో ఆధరగొట్టింది. ఇక దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మనం, సోగ్గాడే చిన్నినాయన అంటూ వరుసగా సినిమాలను చేసిన లావణ్య మిస్టర్ సినిమా సమయంలో పరిచయం అయిన తన కో స్టార్ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ ని అంతరిక్షం సినిమా సమయంలో ప్రేమించింది. అలా ప్రేమించుకున్న ఇద్దరూ తాజాగా జూన్ 9న ఎంగేజ్మెంట్ ద్వారా ఒక్కటయ్యారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారు.






























