Movie News

ఈవీవీ సత్యనారాయణ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను, ప్రేమకథా చిత్రాలను, యాక్షన్ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు.ఈవీవీ ఇండస్ట్రీలో బ్రతికినన్ని రోజుల్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆయన మరణించినప్పటికీ అతను దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి. ఇంతగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి పలు ఆసక్తికరమైన, చాలామందికి తెలియని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఈవీవీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం, దొమ్మేరు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈవీవీ కి చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఎంతో పిచ్చి ఉండేది. ఈ క్రమంలోనే నిర్మాతగా అప్పట్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నవతా కృష్ణంరాజు తెలిసిన వ్యక్తి తన ఊరిలో ఉండటంవల్ల ఆయనతో రికమెండేషన్ లెటర్ పెట్టించుకుని మద్రాస్ బయలుదేరారు. ఈ విధంగా నిర్మాత నవతా కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి అతని దగ్గరి నుంచి చేదు అనుభవం ఎదురైంది.

కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి ఈ సినిమా గోల ఎందుకు? ఇక్కడ ఏ కొందరికో అవకాశం వస్తుంది అంటూ చాలా నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ సినిమాలపై ఉన్న మక్కువతో నిర్మాత కృష్ణంరాజు దర్శకుడు దేవదాస్ కనకాల దగ్గర ఈవీవీను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఓనమాలను ఈవీవీ దర్శకుడు దేవదాస్ కనకాల నుంచి నేర్చుకున్నారు. ఇలా దేవదాస్ కనకాల దగ్గర నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత ఈవీవీను జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగుస్తంభాలాట చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా నియమించారు.

అయితే జంధ్యాల దగ్గరకు రాకముందు అతని దృష్టి మొత్తం దర్శకత్వం పైనే ఉండేది. ఆ తర్వాత కథలు రాయడానికి ఇష్టం రావడంతో ఎన్నో కథలను రాసి పత్రికలకు పంపేవారు. అయితే ఆ కథలలో ఎక్కువగా ప్రచురితం కాక వెనక్కి తిరిగి వచ్చేవి. అలా వెనక్కి తిరిగి వచ్చిన కథలలో  ‘ఆడే మగైతే’ అనే కథ ఒకటి. ఈ కథను “మొగుడు – పెళ్లాలు” సినిమా షూటింగ్ సమయంలో జంధ్యాలకు చెప్పినప్పుడు ఈ కథ చాలా బాగుంది చేద్దామని చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి నోచుకోలేక పోయింది.

ఇలా అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సత్యనారాయణ మొట్టమొదటిసారిగా రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన “చెవిలో పువ్వు” అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వకపోయినా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ప్రేమఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే జంబలకడిపంబ, సీతారత్నం గారి అబ్బాయి, అప్పుల అప్పారావు, హలో బ్రదర్, ఆమె, ఆయనకిద్దరు, వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ గొంతు క్యాన్సర్ ద్వారా మృత్యువాత పడ్డారు. ఈయన వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ తన తండ్రి ఉన్నప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన వీరికి తన తండ్రి మరణం తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago