Liger : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమా మిక్స్డ్ టాక్ తో వెళ్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా తో అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్ ఆధారపడింది. అయితే సినిమా మాత్రం జనాలకు చాలా మందికి అంతగా ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ లో ఇంకొంచం బెటర్ గా ఉండుంటే బాగుండేది అనే టాక్ వినిపించింది. అయితే సినిమా రివ్యూ ఎలా ఉందో చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ.

పూరీ విజయ్ ని ముంచేసాడు…
లైగర్ సినిమాలో స్క్రిన్ ప్లే విషయంలో పూరీ జగన్నాథ్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, సినిమా తీయాలంటే కథ అవసరము లేదని పూరీ ఇంతకు ముందు చెప్పవాడు. ఈ సినిమాలో అది కనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని విజయ్ దేవరకొండ, రమ్య కృష్ణ తమ భుజాన వేసుకుని నడిపించినట్లు అనిపిస్తుంది. కథ సరిగా నడపడం లో పూరీ విఫలమయ్యాడు. ఇంతకు ముందు ‘పోకిరి’ సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్ కూడా బాలీవుడ్ సినిమా అమితాబ్ బచ్చన్ సినిమా సీన్ ను కాపీ చేసేసాడు. ఇక సినిమాలో పాత్రలను చూసినా ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునే రేంజ్ లో డిజైన్ చేయలేదు. అనన్య పాండే క్యారెక్టర్ అందుకు ఉదాహరణ.

మొదట్లో ఏదో ప్రముఖ్యం ఉన్న పాత్రలాగా అనిపించినా చివరికి ఏమి ఉండదు సినిమాలో ఆ అమ్మాయి పాత్ర. ఇక విజయ్, అనన్య మధ్య లవ్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకునేట్లు రాలేదు. ఇక సినిమా క్లైమాక్స్ వచ్చే సమయానికి జనాలు లేచి వెళ్లి పోతున్నారు, ఇక అందరూ వెళ్లి పోయే సమయంలో శుభం కార్డు వేశారు. ప్రేక్షకులకు అర్థమైపోయింది క్లైమాక్స్ అంటూ చెప్పారు భరద్వాజ. ఇక సినిమాలో విజయ్ నటన బాగుంది, సినిమా ప్లాప్ అయినా విజయ్ కి మంచి అవకాశాలు వస్తాయి కానీ పూరీ పరిస్థితి కష్టం. రమ్యకృష్ణ రేంజ్ కి ఇంకా మంచి సీన్స్ పడుండాల్సింది. ఇక అసలు రమ్యకృష్ణ అలా పిల్లాడిని తీసుకుని ఎందుకు వచ్చింది అన్నదానికి జస్టిఫికేషన్ ఇవ్వలేదు అంటూ అభిప్రాయపడ్డారు భరద్వాజ.



































